Pawan Kalyan at Vijayawada: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా మంగళవారం విజయవాడకు చేరుకున్నారాయన.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం చేరుకున్నారు. అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లనున్నారాయన. మొదటి అంతస్తులో 212 రూమ్‌ను కేటాయించారు. అదే ఫ్లోర్‌లో జనసేనకు చెందిన ఛాంబర్లు కూడా ఉండనున్నాయి.
తనకు కేటాయించిన ఛాంబర్‌ని పరిశీలించనున్నారు. ఇదిలావుండగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు భద్రత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. వై ప్లస్ సెక్యూరిటీతోపాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయించింది. పవన్‌కు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ కారుని మాజీ సీఎం జగన్ వినియోగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్, ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. ఈ వాహనం తనకు వద్దని సీఎం చంద్రబాబునాయుడు చెప్పడంతో దాన్ని పవన్‌కు కేటాయించడం జరిగింది.
Also Read: అడ్రస్ లేకుండా పోయిన అంబటి.. అసలు ఆయన పొలిటికల్ కెరీర్ ఏంటో తెలుసా ?
బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో నిధులు దుర్వినియోగంపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ కు Y ప్లస్ సెక్యూరిటీ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు భద్రత పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.
Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారు కేటాయింపు.
ఈరోజు సచివాలయం వెళ్లనున్న పవన్.. తన ఛాంబర్ పరిళీలన.. రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్.… pic.twitter.com/NrYNSkBm52— BIG TV Breaking News (@bigtvtelugu) June 18, 2024