E-Paper
Advertisement

హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం.. డీసీఎం వాహనం బీభత్సం, స్కూటీని ఢీకొట్టి 5 కి.మీ ఈడ్చుకెళ్లింది

హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం.. డీసీఎం వాహనం బీభత్సం, స్కూటీని ఢీకొట్టి 5 కి.మీ ఈడ్చుకెళ్లింది
Advertisement

Hi Tech City: హైదరాబాద్ హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం జరిగింది. ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. స్కూటీని ఢీకొట్టిన డీసీఎం వాహనం, ఏకంగా 5 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళా స్పాట్‌లో మృతి చెందింది. ఘటన తర్వాత అక్కడి నుంచి డ్రైవర్ పరారయ్యాడు. అసలేం జరిగింది?

హైదరాబాద్ హైటెక్ సిటీలో అర్ధరాత్రి దారుణం

Advertisement

హైదరాబాద్ హైటెక్ సిటీలో అర్ధరాత్రి ఓ డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. మాదాపూర్‌ సమీపంలోని మైండ్‌స్పేస్‌ పరిసరాల్లో వేగంగా వచ్చిన డీసీఎం, భార్యాభర్తలు ప్రయాణిస్తున్న స్కూటీని బలంగా ఢీ కొట్టింది. దీంతో డీసీఎం కింద స్కూటీ ఇరుక్కుపోయింది. కానీ డీసీఎం డ్రైవరు ఆగకుండా జూబ్లీహిల్స్‌ వరకు వెళ్లిపోయాడు.

దాదాపు ఐదు కిలోమీటర్ల వరకు పోనిచ్చాడు. దీన్ని గమనించిన కొందరు వ్యక్తులు డీసీఎం వాహనాన్ని వెంటాడి మరీ అడ్డుకున్నారు. ప్రజలను గమనించిన డ్రైవర్ వాహనాన్ని వదలి అక్కడి నుంచి పారిపోయాడు. క్లీనర్ అడ్డంగా దొరికిపోయాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన స్థానికులు కోపోద్రిక్తులైన స్థానిక ప్రజలు సహాయకుడిని చితకబాదారు.

Advertisement

డీసీఎం వాహనం బీభత్సం, స్కూటీని ఢీకొట్టి 5 కి.మీ ఈడ్చుకెళ్లింది

ఘటన గురించి తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాహనం క్లీనర్‌ని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఒకరు మృతి చెందిగా, మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి.

కేసు నమోదు చేసిన పోలీసులు, వివరాలు సేకరిస్తున్నారు. మలబార్ బంగారం షాపులో పని చేస్తున్నారు భార్యాభర్తలు. కూకట్‌పల్లిలో సినిమా చూసి మహేశ్వరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భర్త పేరు అబ్దుల్ బాసిత్ కాగా, ఆమె భార్య పేరుహానియా అయేషా. నెంబర్ ప్లేట్ ఆధారంగా డీసీఎం వాహనం ఎవరిది? అనేదానిపై ఆరా తీస్తున్నారు.

ALSO READ: లోయలో పడిన ట్రావెల్ వాహనం.. స్పాట్‌లో 22 మంది, కుల్లు ప్రాంతంలో ఘటన

 

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×