E-Paper
Advertisement

రెండేళ్ల పగ.. టీచర్ ను రాడ్డుతో కొట్టిన స్టూడెంట్

రెండేళ్ల పగ.. టీచర్ ను రాడ్డుతో కొట్టిన స్టూడెంట్
Advertisement

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని లంకలకోడేరులో ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణతో మెలగాలని, పద్ధతిగా ఉండాలని బుద్ధి చెప్పినందుకు ఒక పూర్వ విద్యార్థి తన గురువుపైనే పాశవిక దాడికి ఒడిగట్టాడు. వెంకట సురేష్ అనే ఉపాధ్యాయుడు ఆర్యదీప్ అనే యువకుడిని గతంలో మందలించినట్లు తెలుస్తోంది. సక్రమ మార్గంలో నడవాలని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని టీచర్ చెప్పిన మాటలను సదరు యువకుడు పాజిటివ్‌గా తీసుకోలేకపోయాడు.

ఆ మాటలను మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న ఆర్యదీప్, అదను చూసి ఇనుప రాడ్డుతో టీచర్ వెంకట సురేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘర్షణలో ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఒకప్పుడు విద్యను అందించిన గురువుపైనే ఇలా రాడ్డుతో దాడి చేయడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Advertisement

Also Read: జగన్ రక్తంలోనే అది ఉంది.. మంత్రి సవిత షాకింగ్ కామెంట్స్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×