E-Paper
Advertisement

Congress : అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ డౌటే!.. సర్కార్ వద్ద ‘ప్లాన్ బీ’?

Congress : అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ డౌటే!.. సర్కార్ వద్ద ‘ప్లాన్ బీ’?
Advertisement

azaరాష్ట్ర మంత్రి అజారుద్దీన్‌కు పదవీ గండం పొంచిఉన్నది. కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ఈలోపు ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వకపోతే పదవీ పోవడం ఖాయంగా తెలుస్తున్నది. గవర్నర్ వద్ద పెండింగులో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్‌ను ఆయన ఆమోదించడం లేదు. ఈనెల 30లోపు పెండింగ్ ఫైల్‌ను గవర్నర్ శివధర్ శుక్లా ఆమోదించకపోతే రాజ్యాంగం ప్రకారం తన పదవీకి అజారుద్దీన్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రిగా ప్రమాణం చేసిన ఆరు నెలలలోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలి. లేనియెడల మంత్రి పదవీ పోవడం ఖాయం. ఈ విషయం రాష్ట్ర సర్కారును సైతం కలవరానికి గురిచేస్తున్నట్టు తెలుస్తున్నది.

కేసులే కారణమా?

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్‌‌లను ఎమ్మెల్సీగా కేబినెట్ నామినేట్ చేసింది. ఆ ఫైల్‌ను గవర్నర్ ఆమోదం కోసం లోక్‌భవన్‌కు పంపించింది. ఫైల్ పంపిన సమయంలో గవర్నర్‌గా వేరే వ్యక్తి ఉన్నారు. నెలకిందట కొత్త గవర్నర్ వచ్చారు. అయినప్పటికీ ఆ ఫైల్ ఇంకా క్లియర్ కాలేదు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి శ్రీధర్ బాబు తదితరులు గవర్నర్‌ను కలిసి అజారుద్దీన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని రిక్వెస్టు చేశారు. అంతకుముందు సీఎస్ రామకృష్ణరావు, మంత్రులు సైతం విజ్ఞప్తి చేశారు. అయినా గవర్నర్ ఆ ఫైల్‌ను ఆమోదించలేదు.ఎందుకంటే అజారుద్దీన్ .. హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.న్యాయస్థానంలో కేసు సైతం విచారణ జరుగుతున్నది. అజారుద్దీన్ మీద కేసులు ఉన్నాయని, ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయొద్దని పలువురు గవర్నర్‌కు లేఖలు రాసినట్టు సమాచారం. అందుకే గవర్నర్ ఈ విషయంలో సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

సర్కారు ప్లాన్ బీ..

Advertisement

అజారుద్దీన్‌ ఎమ్మెల్సీగా నామినేట్ అవ్వని పక్షంలో గడువు తేదీ కంటే ముందే ఆయన చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాలని కాంగ్రెస్ సర్కారు యోచిస్తున్నది. మరల ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుని గవర్నర్ నేతృత్వంలోనే ప్రమాణం చేయించాలని భావిస్తున్నది. మరల ఆరు నెలల సమయం దొరుకుతుంది.ఈలోపు న్యాయపరంగా ఉన్న ఇబ్బందులను తొలగించుకుని ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయించాలని రేవంత్ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం మరోసారి కేబినెట్ భేటీ నిర్వహించి ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాంలను నామినేట్ చేసి ఆ ఫైల్‌ను ఆమోదం కోసం మరోసారి గవర్నర్ వద్దకు పంపించాలని ఆలోచన చేసినట్టు సమాచారం.
కేంద్ర ఎన్నికల సంఘానికి TVK చీఫ్ విజయ్ లేఖ.. అందులో ఏం రాసారంటే?

ఒకవేళ అజారుద్దీన్‌కు మంత్రి పదవి మరల ఇవ్వకపోతే మైనార్టీ వర్గం నుంచి వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమయంలో మైనార్టీ వర్గానికి మంత్రిపదవి ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ సీనియర్లు హరీశ్ రావు, కేటీఆర్ పదే పదే నిలదీయడంతో రేవంత్ సర్కార్ ఆగమేఘాల మీద ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాగా, గవర్నర్ ఏమైనా మార్పులు సూచిస్తారా? అనేది సైతం తెలియాల్సి ఉన్నది. ప్రభుత్వం నిర్ణయానికి ఆయన ఏమైనా అడ్డంకులు పెడుతారా? అనేది సైతం తెలియాల్సి ఉన్నది.

Advertisement

 

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×