BigTV English

Miyapur: దారుణానికి ఒడిగట్టిన కసాయి తండ్రి..

Miyapur: దారుణానికి ఒడిగట్టిన కసాయి తండ్రి..

Hyderabad: హైదరాబాద్ మియాపూర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. బాలికను తండ్రే హత్యచేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి నరేష్ బాలికను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి తన కోరికను తీర్చాలని బలవంతపెట్టాడు. తండ్రి కోరిక విని ఆ బాలిక గట్టిగా అరిచింది. ఈ వ్యవహారాన్ని తల్లికి చెబుతానంటూ బెదిరించింది. పోర్న్ వీడియోలు చూస్తూ చెడు అలవాట్లకు బానిసయ్యాడు బాలిక తండ్రి నరేష్.. తన కోరిక తీర్చాలంటూ బాలికపై ఒత్తిడి తెచ్చాడు. అమ్మకు చెప్తానంటూ బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హతమార్చాడు.


నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి హత్య చేశాడు. వారం రోజుల తరువాత బాలిక మిస్సింగ్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహం లభ్యమయ్యింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తండ్రిపై అనుమానంతో తమదైన రీతిలో దర్యాప్తు చేపట్టారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తండ్రి నరేష్ 11 నిమిషాల వ్యవధిలోనే బాలికను హత్య చేసి, వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు గుర్తించారు. అంతేకాదు బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి అక్కడికి వెళ్లి చూశాడని, ఇలా వరుసగా మూడురోజులపాటు అక్కడికి వెళ్లి బాలిక మృతదేహాన్ని చూసి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read: దారుణం.. నడిరోడ్డుపై ప్రియురాలిని 18 సార్లు ఇనుప రెంచ్‌తో కొట్టి చంపిన ప్రియుడు


అయితే, తన కూతురు మిస్ అయినట్లుగా నరేష్ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నరేష్ దంపతుల స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మర్రిపెడ మండలం ఎల్లంపేట గ్రామం అని, బ్రతుకుదెరువు కోసం వారు నడిగడ్డ తండాకు వలసవచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. వచ్చిన 15 రోజులకే కన్న కూతురును హత్య చేశాడు కసాయి తండ్రి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Tags

Related News

Attack On Law Student: కారులో బంధించి 60 చెంపదెబ్బలు.. వామ్మో, ఇలా కూడా కొడతారా? ఇదిగో వీడియో

Nagarkurnool Crime: చేతబడి చేశాడన్న అనుమానం.. కొడుకు చేతిలో తండ్రి దారుణ హత్య!

UP Murder: పక్కా స్కెచ్‌తో భర్తను లేపేసిన భార్య.. కారణం తెలుసుకుని షాకైన పోలీసులు ?

Anakapalli crime: పోలీసులపై సుత్తితో దాడి చేసి ఖైదీలు పరార్.. ఏపీలో ఘటన!

Kalwakurthy murder: తండ్రిని కర్రతో చంపి వాగులో పారేసిన కొడుకు.. కల్వకుర్తిలో దారుణం!

Dharmavaram News: రాష్ట్రంలో దారుణ హత్య.. వేట కొడవళ్లతో నరికి నరికి చంపేశారు, వీడియో వైరల్

Big Stories

×