E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ సిటీలో దారుణం.. భార్యని సుత్తితో కొట్టిన భర్త, ఆ తర్వాత పెయింట్ పోసి, చివరకు

Hyderabad Crime:  హైదరాబాద్ సిటీలో దారుణం.. భార్యని సుత్తితో కొట్టిన భర్త, ఆ తర్వాత పెయింట్ పోసి, చివరకు
Advertisement

Hyderabad Crime: చిన్న చిన్న తప్పులు ఫ్యామిలీలో విభేదాలకు దారి తీస్తున్నాయి. ఒకరు అవును.. మరొక కాదనడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. క్షణికావేశంలో దారుణమైన ఘటనకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. పట్టరాని కోపంతో భార్యని సుత్తితో కొట్టి చంపేశాడు భర్త. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ సిటీలో వెలుగు చూసింది. ఈ స్టోరీ డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం.

హైదరాబాద్ సిటీలో హయత్ నగర్ ప్రాంతంలో దారుణం

Advertisement

హైదరాబాద్ సిటీలోని హయత్ నగర్ పరిధిలో దారుణమైన ఘటన బయటపడింది. ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. పైన కనిపిస్తున్న దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు, చీటికీ మాటికీ కొంతకాలంగా కలహాలు మొదలయ్యాయి. కూర్చుని సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాల్సి ఈ దంపతులు పంతాలకు వెళ్లారు. ఏ ఒక్కరూ వెనక్కి తగ్గలేదు.

ఫలితంగా ఒకరిపై మరొకరికి ఆగ్రహం మొదలై.. చివరకు పగగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం గొడవ జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన భర్త.. ఇంట్లోకి వెళ్లి సుత్తిని తీసుకుని భార్య తలపై బలంగా మోదాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలింది. అప్పటికి గానీ భర్త మనసులో కోపం చల్లారలేదు. ఈ విషయం తెలిస్తే పోలీసులు తనను అరెస్ట్ చేస్తాడని భయపడ్డాడు.

Advertisement

భార్యని సుత్తితో కొట్టిన భర్త, ఆ తర్వాత పెయింట్ పోసి డ్రామా ఆడాడు

ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. భార్య పరిస్థితి విషమించిందని నమ్మించి కొత్త డ్రామా ఆడాడు. భార్య తలపై పెయింట్ వేశాడు. పెయింటింగ్ డబ్బా పడి సృహ కోల్పోయిందని కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారిని నమ్మించాడు. చికిత్స కోసం భార్యని వెంటనే యశోద ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రికి వెళ్లేసరికి ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తేల్చారు. తండ్రి ప్రవర్తనపై కూతుళ్లకు అనుమానం ఏర్పడింది.

తండ్రి చెబుతున్న కథపై అనుమానం కలిగడంతో వెంటనే హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటకు వచ్చాయి. కుటుంబంలో కలహాల కారణంగా తాను సుత్తితో కొట్టి చంపేసినట్టు నిందితుడు నిజాన్ని అంగీకరించాడు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ALSO READ: సికింద్రాబాద్‌లో విషాదం.. మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×