BigTV English

Myanmar Fake Job Alert| మయన్మార్‌లో నకిలీ ఉద్యోగాల రాకెట్.. భారత్ ఐటీ నిపుణులే టార్గెట్!

Myanmar Fake Job Alert| మయన్మార్‌లో నకిలీ ఉద్యోగాల రాకెట్.. భారత్ ఐటీ నిపుణులే టార్గెట్!

Myanmar Fake Job Alert| భారతదేశంలోని ఐటీ నైపుణ్యం కలిగిన యువతను లక్ష్యంగా చేసుకొని మయన్మార్‌లో నకిలీ ఉద్యోగ రాకెట్ నడుస్తోందని.. భారీ జీతాలకు ఆశపడి మోసపోవద్దని మయన్మార్‌లో భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి హెచ్చరికలు గతంలో జూలై 5, 2022, అక్టోబర్ 14, 2022, మార్చి 28, 2023న కూడా భారత రాయబార కార్యాలయం జారీ చేసింది.


అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్‌లు వివిధ కంపెనీల ద్వారా మయన్మార్‌లో ఉద్యోగాలు అందిస్తున్నట్లు నమ్మించి యువతను ట్రాప్ చేస్తున్నాయని భారత రాయబార అధికారులు పేర్కొన్నారు. మయన్మార్‌లోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి సిండికేట్లు పనిచేస్తున్నాయి. మైవడ్డీ, యాంగోన్, లౌక్కైంగ్, లాషియో, టాచిలీక్ లాంటి ప్రాంతాల్లో ఈ క్రైమ్ సిండికేట్ పనిచేస్తోందని తెలిపారు.

Also Read: Mumbai BMW Car Accident : శివసేన నాయకుడి కుమారుడు కారు నడుపుతున్నట్లుగా సీసీటీవి వీడియో!


ఇటీవల, మయన్మార్ ప్రభుత్వం ఆన్‌లైన్ స్కామింగ్, మనీలాండరింగ్ మరియు మానవ అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులకు కఠినమైన శిక్షలను ప్రకటిస్తూ.. కొత్త చట్టం తీసుకువచ్చింది.

ఈ క్రైమ్ సిండికేట్‌లకు వ్యతిరేకంగా మయన్మార్ తోపాటు పొరుగు దేశాల ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.

సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు, భారీ జీతాలు చూసి మోసపోవద్దని.. అప్రపత్తంగా ఉండాలని.. జాబ్ ఆఫర్ చేసే కంపెనీ గురించి విదేశాల్లోని ఎంబసీ ద్వారా పూర్తి సమాచారం పొందవచ్చునని.. అధికారులు సూచించారు. అలాగే జాబ్ ఇప్పిస్తామని చెప్పే బ్రోకర్లు, రిక్రూట్ మెంట్ ఏజెన్సీల గురించి పూర్వాపరాలను తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Also Read: Pakistan| 15 రోజుల చంటి పాపను సజీవంగా పాతిపెట్టిన తండ్రి!.. ఎందుకంటే?

పూర్తి వివరాల కోసం.. భారత రాయబార కార్యాలయం, యాంగోన్ ఈ మెయిల్ cons.yangon@mea.gov.in, లేదా మొబైల్ నంబర్: +9595419602 (WhatsApp-Viber-Signal) ద్వారా సంప్రదించవచ్చు.

ఇటీవల ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి భారతీయులను మయన్మార్, కంబోడియా దేశాలలో బానిసలుగా పనిచేయిస్తున్నట్లు వెలుగులో వచ్చింది. ముఖ్యంగా ఐటి నైపుణ్యం ఉన్నవారిని తీసుకెళ్లి.. ఒక గదిలో బంధించి వారి చేత.. భారతీయుల బ్యాంక్ అకౌంట్ల నుంచి హ్యాకింగ్ చేసి డబ్బు దొంగతనం చేయించడం లాంటి నేరాలు చేయిస్తున్నట్లు అక్కడి నుంచి తప్పించుకున్న బాధితులు తెలిపారు. చెప్పినట్లు చేయకుంటే కర్రలతో కొట్టడం, కరెంట్ షాకివ్వడం లాంటివి చేస్తారని బాధితులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. బాధితుల్లో భారతీయులతోపాటు, చైనా, వియత్నాం పౌరులు కూడా ఉండడం గమనార్హం.

 

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×