E-Paper
Advertisement

Pakistan| 15 రోజుల చంటి పాపను సజీవంగా పాతిపెట్టిన తండ్రి!.. ఎందుకంటే?

Pakistan| 15 రోజుల చంటి పాపను సజీవంగా పాతిపెట్టిన తండ్రి!.. ఎందుకంటే?
Advertisement

Pakistan| హృదయాన్ని కలిచివేసే ఒక షాకింగ్ ఘటన పాకిస్తాన్ లో జరిగింది. పాకిస్తాన్ లోని తరుషా నగరంలో ఓ వ్యక్తి తన 15 రోజుల కుమార్తెను సజీవంగా పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తయ్యబ్ కు కొన్ని రోజుల క్రితమే ఒక కుమార్తె జన్మించింది. అయితే ఆ చంటిపాపకు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి.

ఉద్యోగం కోల్పోయి, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న తయ్యబ్ ఆ పసికందుకు వైద్యం అందించలేక.. ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు. ఆ నవజాత శిశువును గోనె సంచిలో పెట్టి పాతిపెట్టానని తయ్యబ్ మీడియాకు తెలిపాడు.

Advertisement

తన నేరాన్ని అంగీకరించిన తయ్యబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలను అనుసరించి, ఫోరెన్సిక్ పరీక్ష కోసం సమాధి నుంచి పాప శవాన్ని వెలికితీస్తామని, పోస్ట్‌మార్టం చేయిస్తామని పోలీసులు తెలిపారు.

Also Read: Mumbai BMW Car Accident| శివసేన నాయకుడి కుమారుడు కారు నడుపుతున్నట్లుగా సీసీటీవి వీడియో!

Advertisement

మైనర్ ఇంటి పనిమనిషిని తీవ్ర వేధింపులుకు గురి చేసిన పాక్ దంపతులు
లాహోర్‌లోని డిఫెన్స్ B ప్రాంతంలో నివసిస్తున్న దంపతులు తమ ఇంట్లో పనిచేస్తున్న 13 ఏళ్ల బాలిక ను తీవ్ర వేధింపులకు గురి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి ఓనర్లు ఆ మైనర్ పనిమనిషి బట్టలు విప్పి, శారీరకంగా హింసించారని.. బాధితురాలి తల్లి తహ్రీమ్ ఫిర్యాదు చేయడంతో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వెంటనే కేసు నమోదు చేసి.. ఇంటి ఓనర్ హస్సామ్ ను అరెస్టు చేశారు. అయితే ఇంటి ఓనర్ భార్య పరారీలో ఉండడంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

Also Read: Rahul Gandhi | నేడు మణిపూర్‌ కు రాహుల్ గాంధీ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఇంట్లో దొంగతనం చేసిందని అనుమానంతో ఇంటి ఓనర్లు ఆమెను బట్టలు విప్పి నగ్నంగా నిలబెట్టారని, ఆ తరువాత ఆమెను కొట్టారని ఫిర్యాదులో బాధితురాలి తల్లి పేర్కొంది. ఇంటి ఓనర్లు క్రూరంగా కొట్టడంతో బాధితురాలి చేయి, ముక్కు ఫ్రాక్చర్ అయింది. వైద్య పరీక్షల అనంతరం బాధితురాలిని ఇంటికి పంపించామని.. త్వరలోనే నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి.. కఠినంగా శిక్షపడేలా చూస్తామని పోలీసు ఉన్నతాధికారి హామీ ఇచ్చారు.

 

Tags

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×