Bhadradri Crime: పెళ్లి చూపులు ఓ యువతి ప్రాణాలు తీశాయి. పెళ్లి చూపులకు వచ్చిన వరుడే ఆ యువతిని ఓయూకు తీసుకెళ్లి శారీరకంగా వాడుకున్నాడు. తరువాత పెళ్లికి మొహం చాటేయ్యడంతో, మనస్తాపం చెందిన ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలంలో జరిగింది.
వెంకట్యా తండాకు చెందిన తుల్లిక శ్రీ ఇంటికి సీతారాం పూర్ కు చెందిన యువకుడు బిచ్చా నాయక్ పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఇతను ఎయిర్ పోర్టులో పనిచేస్తున్నట్లు సమాచారం. అక్కడ తుల్లిక శ్రీ, బిచ్చాకు ఒకరినొకరు నచ్చడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి ఒకే అన్నారు. వివాహం కూడా నిశ్చయించారు. పెళ్ళి కుదరడంతో బిచ్చాతో సన్నిహితంగా ఉంది తుల్లిక శ్రీ. ఒకరినొకరు ఫోన్ నెంబర్లు తీసుకుని మాట్లాడుకునే వారు.
Also Read: TG High Court: రామంతాపూర్ ఘటనపై హైకోర్టు సీరియస్.. నివేదక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం
అయితే కొద్దిరోజులు బాగానే మాట్లాడుకున్న వీరిద్దరూ బయట కూడా కలవడం మొదలుపెట్టారు. షాపింగ్ లకు, షికార్లుకు కూడా తిరిగేవారు. అదే పరిచయం కాస్త ఓయో రూం వెళ్లేంత వరకు వచ్చింది. అక్కడ తుల్లిక శ్రీని మాయమాటలతో శారీరకంగా అనుభవించాడు బిచ్చా. అప్పటి వరకు బాగానే వున్న బిచ్చా మాటల్లో మార్పు వచ్చింది. చివరకు బిచ్చా మాటల్లోనే కాదు.. పెళ్లి కూడా చేసుకోనంటూ యూటర్న్ తీసుకున్నాడు. తుల్లిక శ్రీని అనుమానించడం మొదలుపెట్టాడు. తుల్లిక శ్రీకి వేరొకరితో సంబంధం ఉందని, తాను పెళ్లి చేసుకోనంటూ తుల్లిక శ్రీని వేధించాడు.
బిచ్చా ఫోన్ కూడా లిప్ట్ చేయకపోవడంతో, యువతి మస్తాపం చెందింది. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు తెలిస్తే పరువుపోతుందని భావించి బలవన్మరణానికి పాల్పడింది. పరుగుల మందు తాగి విలవిల లాడుతున్న తుల్లిక శ్రీని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తుల్లిక శ్రీ చికిత్స పొందుతూ చివరకు ప్రాణాలు కోల్పోయింది. అయితే బిచ్చా నాయక్ కారణంగానే తన కూతురు మృతి చెందిందని తుల్లిక శ్రీ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కూతురు మృతికి న్యాయం చేయాలని కోరారు. తన కూతురికి నమ్మించి మోసం చేశాడని, బిచ్చాలకి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.