Hydrabad News: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అయితే వీరంతా అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానికులు మాట. ఎవరైనా విషం కలిపారా? సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేదానిపై రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులంతా కర్ణాటకకు చెందినవారుగా తెలుస్తోంది.
గుల్బర్గా జిల్లా రంజోలికి చెందిన లక్ష్మయ్య-60, వెంకటమ్మ-55, అనిల్-32, కవిత-24గా గుర్తించారు. వీరితోపాటు ఓ రెండేళ్ల చిన్నారి ఉన్నట్లు పోలీసుల మాట. అటు క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని ఇంట్లో కొన్ని ఆధారాలు గుర్తించారు. లభించిన ఆధారాల్లో ఓ ఫోన్ కూడా ఉంది. అందులోని కాల్ డేటా ఆధారంగా విచారణ మొదలుపెట్టారు.
లక్ష్మయ్య కుటుంబానికి ఇరుగుపొరుగు వారితో విభేదాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఫ్యామిలీ మొత్తం విషం తీసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో అత్త-మామ, కూతురు-అల్లుడు, వారి రెండేళ్ల కూతురు ఉంది. మక్తా మహబూబ్‌పేటలో ఈ విషాదం జరిగింది. ముందు చిన్నారికి విషం ఇచ్చి, ఆ తర్వాత పెద్దలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: రాష్ట్రంలో దారుణం.. నీటకుంటలో పడి ఆరుగురు చిన్నారులు మృతి
లక్ష్మయ్య దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వారిలో రెండో కూతురు కవిత-అల్లుడు అనిల్, వారి కూతురు ఉన్నట్లు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు కారణమా? లేక మరేదైనా ఉందా అనేది తెలియాల్సివుంది.