Ahmedabad News: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థినిని పదో తరగతి స్టూడెంట్ కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. దీంతో అక్కడి స్థానికులు పాఠశాలకు వెళ్లి యాజమాన్యంతో గొడవకు దిగారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
#WATCH | Gujarat: A class 8 student was stabbed and injured by a student of class 10 in Seventh-Day Adventist school, Ahmedabad, yesterday.
Visuals from the school as people, including the injured child's relatives, create ruckus here. pic.twitter.com/A1jHkTcZFd
— ANI (@ANI) August 20, 2025
పోలీసులు వివరాల ప్రకారం.. ఆహ్మదాబాద్ నగరంలోని మణినగర్ లో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ప్రైవేట్ స్కూల్ లో ఈ ఘటన జరిగింది. ఎనిమిదో తరగతికి చెందిన విద్యార్థికి, టెన్త్ క్లాస్ చెందిన మరో విద్యార్థికి చిన్న గొడవ జరిగింది. అయితే ఇద్దరి విద్యార్థుల మధ్య మాటా మాట పెరిగి గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. సహనం కోల్పోయిన టెన్త్ స్టూడెంట్ తన వద్ద ఉన్న కత్తితో మరొ విద్యార్థిని కిరాతకంగా పొడిచాడు. ఈ ఘటనలో ఎనిమిదో తరగతి స్టూడెంట్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్కూల్ టీచర్లు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.
ALSO READ: KTR: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మా మద్దతు ఆ పార్టీకే.. ఈ ఎలక్షన్ అంతా ఓ డ్రామా: కేటీఆర్
చనిపోయిన బాలుడు సింధీ కమ్యూనిటీ చెందిన స్టూడెంట్. చంపిన బాలుడు ముస్లిం కమ్యూనిటీ చెందిన విద్యార్థి. అయితే బాలుడు చనిపోయిన వెంటే సింధీ కమ్యూనిటీ చెందినవారు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అలాగే చనిపోయిన బాలుడు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున స్కూల్ కు తరలివెళ్లారు. స్కూల్ లో బస్సులను, కార్లను, టూ వీలర్లను ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. ఇంతటితో ఊరుకోకుండా పాఠశాల సిబ్బందిని, ప్రిన్సిపాల్ పై దాడులు చేశారు. తలుపులు, కిటికీలు, గాజు ప్యానెళ్లను పగలగొట్టారు. చివరకు పోలీసులు సమాచారం తెలియడంతో అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ALSO READ: Weather News: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త..!
పోలీసులు మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, పాఠశాలలోని ఇతర విద్యార్థులను సమాచారం అడిగి తెలుసకుంటున్నారు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. స్థానికులు స్కూల్ యాజమాన్యంపై నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఫైరయ్యారు. విద్యార్థులు కత్తులు తీసుకొచ్చినా… స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.