BigTV English

Jonnagiri: అదృష్టమంటే ఈమెది.. రూ.300 కూలికి పోతే.. రూ.40లక్షల వజ్రం దొరికింది..!

Jonnagiri: అదృష్టమంటే ఈమెది.. రూ.300 కూలికి పోతే.. రూ.40లక్షల వజ్రం దొరికింది..!

Jonnagiri: అదృష్టం ఉంటే బంగారం అయినా దొరుకుద్ది అని పెద్దలు చెబుతుంటారు. ఎంత కష్టపడినా ఆవగింజంత అదృష్టం ఉండాలని కూడా అంటారు.. ఈ సామెతల ప్రకారం అదృష్టం మన వైపు ఉంటే, అరుదైన, విలువైన వస్తువులు కూడా అనుకోకుండా మన సొంతం కాగలవు. అదృష్టం సహకరిస్తే అసాధ్యమైనవి కూడా సుసాధ్యమవుతాయి. ఉదాహరణకు కొంత మంది వారి వృత్తి రీత్యా ఎంత కష్టపడినా విజయవంతం కాలేరు. అదే మరి కొందరు ఏదో గాలికి నామ్ కే వస్త్ చేసుకుంటూ వెళ్తుంటారు.. వారికే అదృష్టం దరి చేరుతోంది. కొందరికి అప్పుడప్పుడు రోడ్లపై బంగారం, విలువైన వస్తువులు దొరుకుతుంటాయి. అయితే తాజాగా కర్నూలు జిల్లాలో కూలికి వెళ్లిన మహిళకు ఏకగా రూ.40లక్షల విలువైన వజ్రమే దొరికింది. ఇక ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కర్నూలు జిల్లాలో ఇలా వజ్రాలు దొరకడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు వజ్రాలు దొరికాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


రూ.300 కూలికి వెళ్తే.. అదృష్టం వరించింది..

కర్నూలు జిల్లాలో తుగ్గలి మండలంలో జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ సామాన్య వ్యవసాయ కుటుంబానికి చెందిన మహిళ రోజు వారీ పనిలో భాగంగా బుధవారం కూలికి వెళ్లింది. ఆమె రూ.300 సంపాదించే ఉద్దేశంతో కూలికి వెళ్లింది. అయితే ఆమె పని చేసుకుంటూ వెళ్తుండగా మిలమిల మెరుస్తూ ఖరీదైన వజ్రం కనిపించింది. అయితే ఆమె మొదట దాన్ని ఓ సాధారణ రాయిగా భావించింది. చుట్టుపక్కల వారు దాని విలువ గురించి చెప్పడంతో మహిళా ఆ వజ్రాన్ని నేరుగా ఆ విలువైన వజ్రాన్ని స్థానిక వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకెళ్లి చూపించింది. ఆ వ్యాపారి దాన్ని చూసి ఇది అత్యంత ఖరీదైన వజ్రమని చెప్పారు. మహిళ దగ్గర నుంచి రూ.40 లక్షలకు వజ్రాన్ని కొనుగోలు చేశాడు.


చూసేందుకు తరలివస్తున్న స్థానికులు

ఈ వజ్రాన్ని ఆ వ్యాపారి రూ.40 లక్షలకు కొనుగోలు చేయడంతో ఆ మహిళా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విలువైన వజ్రం దొరకడంతో ఆమె జీవితంలో కొన్ని సమస్యలకు పులిస్టాప్ పడవచ్చు. రూ.300 రోజువారీ కూలీ నుంచి లక్షల రూపాయల వజ్రం దొరకడం అనేది ఆమె అదృష్టం. ఈ వార్త స్థానికంగా వైరల్ కావడంతో.. వందలాది మంది ఆ వజ్రాన్ని చూసేందుకు ఆ కూలీని అభినందించేందుకు తరలివచ్చారు.

ALSO READ: Job guarantee courses: ఇంటర్, డిగ్రీ అవసరం లేదు.. పదో తరగతి తర్వాతే డైరెక్ట్ జాబ్.. ఇలా చేయండి!

గతంలో కూడా చాలా సార్లు..!!

గత కొన్ని రోజుల నుంచి కర్నూలు జిల్లా జొన్నగిరి వజ్రాలు దొరుకుతున్నాయి. ఇది వజ్రాల ప్రాంతంగా పేరు పొందింది. తొలకరి వర్షాలు కురిసిన ప్రతిసారీ ఈ ప్రాంతంలోని మట్టి పొరలు తడిసి లోపల నుంచి వజ్రాలు బయటపడుతున్నాయి. ఈ సీజన్‌లో కూడా వర్షాలు కురవడంతో స్థానిక రైతులు, కూలీలతో పాటు పొరుగు జిల్లాల నుంచి కూడా జనాలు తరలివచ్చి వజ్రాల కోసం గాలింపు చేపడుతున్నారు. గతంలో కూడా జొన్నగిరి గ్రామానికి చెందిన రైతులు రోజూ వలె పొలంలో మట్టి పనులు చేస్తుండగా, మిలమిలలాడే రాళ్లు చాలా సార్లు కనిపించాయి. వారకు మొదట అది సాధారణ రాయి అనుకున్నారు. కానీ స్థానిక వజ్ర వ్యాపారి వద్ద చూపించగా అవి అత్యంత విలువైన వజ్రాలుగా గుర్తించారు. ఇక అప్పటి నుంచి ఈ ప్రాంతం వజ్రాల ప్రాంతంగా పేరు పొందింది. చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి గాలింపు చేపడుతున్నారు.

ALSO READ: Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

తక్కువ ధరకే విక్రయిస్తున్నారా..? జాగ్రత్త

అయితే, జొన్నగిరి ప్రాంతంలో చాలా మందికి విలువైన రాళ్లు దొరకుతున్నాయి. వాటి విలువ తెలియక చాలా మంది పడేస్తున్నారు. వజ్రాల విలువను గుర్తించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గతంలో కొందరు తక్కువ ధరకే విక్రయించి నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మహిళకు విలువైన వజ్రం దొరకడంతో.. జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల వేటకు కొత్త హంగును తెచ్చిందని చెప్పవచ్చు. ఒక సామాన్య కూలీ జీవితంలో జరిగిన ఈ అద్భుతం.. అదృష్టం.. ఎప్పుడు, ఎవరిని వరించినా ఆశ్చర్యం కలిగిస్తుందనడానికి నిదర్శనం అని చెప్పవచ్చు.

Related News

GST On Health: సామాన్యుడికి ఊరట.. హెల్త్, ఇన్యూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు?

DMart: డిమార్ట్‌ లో ఇలా చేస్తున్నారా? ఇదిగో ఇతడిలాగానే బుక్కైపోతారు జాగ్రత్త!

Blinkit New Feature: సూపర్.. బ్లింకిట్ కొత్త ఆప్షన్.. స్విగ్గీ, జెప్టోలో లేని ఫీచర్..

D-Mart: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

Big Stories

×