Prabhas:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు.. ముఖ్యంగా వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రకటిస్తూ.. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రస్తుతం మారుతీ (Maruthi) దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏడాది డిసెంబర్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల వచ్చే యేడాది సంక్రాంతికి వాయిదా పడింది. మరొకవైపు ‘సీతారామం’సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ తో పాటూ కల్కి 2, సలార్ 2 చిత్రాలను కూడా లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే మరో సినిమా అనౌన్స్మెంట్ పై వార్తలు వినిపిస్తున్నాయి.
భీముడి పాత్రలో ప్రభాస్..
ప్రస్తుతం ప్రభాస్ ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) తో గతంలో మిర్చి లాంటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల స్క్రిప్ట్ లో ప్రభాస్ మహాభారతంలోని భీముడి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహాభారతం నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా ఈ పిక్చర్ రూపొందుతోందని, ప్రభాస్ లుక్కు కోసం స్పెషల్ టీం ఇప్పటికే పని మొదలుపెట్టిందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా మిర్చి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా? అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. మరి కొంతమంది భీముడి పాత్రకు ప్రభాస్ ఖచ్చితంగా సూట్ అవుతాడు.. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు.
మరో హిట్ గ్యారెంటీ అంటున్న ఆడియన్స్..
ఇకపోతే కొరటాల శివ.. ప్రభాస్ తో ఈ సినిమా చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ప్రాజెక్టులో కొరటాల సోషల్ మెసేజ్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ జోడించి మరో శ్రీమంతుడు లాంటి హిట్ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రాబోతోందని సమాచారం. ఇకపోతే ఇప్పటికే ప్రభాస్ తో మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి చిత్రాలు చేసి సత్తా చాటిన కొరటాల శివ.. ఇప్పుడు ఎలాగైనా మరో గ్రాండ్ సక్సెస్ ను అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట. ఇది ఒక ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ప్రభాస్ – కొరటాల కాంబోలో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక బాలీవుడ్ నటిని తీసుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో ప్రభాస్ మరో ఫీట్ అందుకోబోతున్నారని చెప్పవచ్చు.
ALSO READ:Jr.NTR: ఎమ్మెల్యే ఆడియో లీక్ చేసింది నేనే.. ఇప్పుడు ప్రాణ హాని – ఎన్టీఆర్ ఫ్యాన్