Hyderabad News: సమాజంలో రోజు రోజుకీ మానవ సంబంధాలకు మనుగడ లేకుండా పోతుంది. వాయి, వరుసలు లేకుండా అత్యాచారాలు, ఆ పై హత్యల సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న గొడవలకే ప్రాణాలను తీసుకుంటున్నారు. చిన్న గొడవలకు సహనం కోల్పోయి పిల్లలను చంపి వారు ఆత్మహత్యకు పాల్పడడం, వేరే వ్యక్తిని ప్రేమించిందని కూతరిని చంపడం, ఆస్తి తగాదాల్లో అన్నను చంపిన తమ్ముడు, ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య, ప్రియురాలితో భార్యను చంపిన భర్త ఇలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని బాచుపల్లిలో భార్యాభర్తల గొడవకు ఇద్దరు పిల్లలు బలి అయ్యారు. భర్తతో గొడవ పెట్టుకుని సహనం కోల్పోయిన భార్య తన ఇద్దరు పిల్లలను దారుణంగా చంపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భర్తతో గొడవపడి పిల్లలను సంపులో పడేసిన తల్లి..
హైదరాబాద్, బాచుపల్లి పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత కొన్ని రోజుల నుంచి భార్యభర్తల మధ్య నిత్యం గొడవ జరుగుతోంది. ఈ మధ్య కూడా ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం.. తీవ్ర స్థాయికి చేరుకుంది. భర్తతో గొడవపడి సహనం కోల్పోయిన భార్య తన ఇద్దరి పిల్లలను సంపులో పడేసింది. దీంతో పిల్లలు ఊపిరాడక మృతిచెందారు. తర్వాత తను కూడా సంపులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే లక్ష్మీ అనే మహిళను కాపాడి ఆస్పత్రికి తరలించారు.
భర్త డ్యూటీకి వెళ్లిన సమయంలో…
ఇంటి ముందు సంపులో ఊపిరాడక 8 నెలల సుభాన్, మూడేళ్ల అరుణ్ మృతిచెందారు. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్టు సమాచారం. మంగళవారం అర్ధరాత్రి 12:40 సమయంలో లక్ష్మీ తన ఇద్దరు పిల్లలను సంపులో పడేసింది. భర్త నైట్ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం, లక్ష్మీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అదే ఆస్పత్రిలో పిల్లలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Crime News: ఎనిమిదో తరగతి విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన టెన్త్ స్టూడెంట్.. చివరకు టీచర్లపై?
ALSO READ: Weather News: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త..!