BigTV English

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

Bhavani Rapido Success: భర్త అనారోగ్యం.. రాపిడో బైక్‌తో అండగా భవానీ.. ట్వీట్ చేసిన టిడిపి!

Bhavani Rapido Success: ఇంటికి పెద్ద దిక్కు అయిన భర్త అనారోగ్యంతో మంచం పట్టాడు.. ఇంట్లో పిల్లలు ఆకలితో ఎదురుచూస్తున్నారు.. అలాంటి కష్టకాలంలో ఓ మహిళ తన ధైర్యం, ఆత్మస్థైర్యంతో నిలబడి, ఇప్పుడు తన కుటుంబానికి బలంగా నిలిచింది. మహిళా సాధికారతను కేవలం మాటల్లోనే కాకుండా, జీవితంలో చూపిస్తూ.. ‘ఓడిపోకు.. నిలబడే దారిని వెతుకు’ అన్న సీఎం చంద్రబాబు మాటలను నిజం చేస్తూ ఇప్పుడు విజయవాడ వీధుల్లో తన రెండు చక్రాలపై దూసుకుపోతూ, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోందని టిడిపి ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది.


విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన భవానీ కథ ఇది. ఇంట్లో ఏకైక ఆదాయ మార్గం అయిన భర్త, ఒక్కసారిగా అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైపోయాడు. అప్పుడు ఆ కుటుంబానికి ఎదురైన ఆర్థిక సమస్యలు చెప్పలేనివి. ఇల్లు నడపడానికి డబ్బు లేదు.. పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతాయేమోనన్న భయం.. అప్పటి పరిస్థితుల్లో భవానీకి ఒక్క ఆశ్రయం స్వయం సహాయక సంఘమే.

సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన డ్వాక్రా లోన్లు ఆ సమయానికే ఆమెకు ఒక కొత్త మార్గం చూపించాయి. రెండు చక్రాల వాహనాన్ని కొనుగోలు చేసి, దానితో ఏదో చేయాలనుకుంది. అప్పుడు రాపిడో (Rapido) సర్వీస్‌పై దృష్టి పెట్టింది. ఎలాంటి భయం లేకుండా తన రెండుచక్రాల వాహనాన్ని యాప్‌లో నమోదు చేసి, రైడ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. మొదట్లో కుటుంబసభ్యులు, కొందరు పొరుగువారు మహిళలు రోడ్లపై బైక్ నడపడం కష్టం అంటూ అనుమానించారు. కానీ భవానీ ఆ అనుమానాలన్నింటినీ తప్పు చేస్తూ, పట్టుదలతో ముందుకు సాగిందట.


ఇప్పుడేమో విజయవాడ వీధుల్లో బైక్‌పై దూసుకుపోతూ, తన కుటుంబానికి తాను ఒక్కరే ఆధారమని రుజువు చేస్తోంది. ప్రతిరోజు అనేక రైడ్స్ పూర్తి చేసి, సంపాదనతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, భర్త వైద్య చికిత్స అన్నీ భుజాన వేసుకుంది. మహిళా దినోత్సవం రోజు సీఎం చంద్రబాబు ఇచ్చిన దిశానిర్దేశం నాకు ఒక పెద్ద మలుపు. అప్పట్లో నేను కుంగిపోయి ఉన్నాను. కానీ ఆయన చెప్పిన మాటలు నాలో నమ్మకాన్ని నింపాయి. ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగింది.. మా కుటుంబం కూడా ఆర్థికంగా బలపడిందని భవానీ గర్వంగా చెబుతోంది.

స్వయం సహాయక సంఘం తోడ్పాటు
భవానీ కథలో మరో ముఖ్య కారణం స్వయం సహాయక సంఘాల మద్దతే. మహిళలకు ఆర్థికంగా నిలబెట్టే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానం ఇప్పుడు అనేక కుటుంబాల పరిస్థితిని మార్చేసింది. డ్వాక్రా లోన్లు, తక్కువ వడ్డీ రేట్లు, మహిళలకు ప్రత్యేక శిక్షణలతో ఈ మార్పు సాధ్యమైందని చెబుతున్నారు అధికారులు.

Also Read: AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

మహిళా సాధికారతకు నిజమైన ఉదాహరణ
భవానీ జీవితం ఇప్పుడు ప్రాంతంలో స్ఫూర్తిదాయకంగా మారింది. మేము కూడా ఏదైనా కొత్తగా నేర్చుకుని, మన జీవితాన్ని మార్చుకోవచ్చని అనేక మహిళలు భవానీని చూసి ప్రేరణ పొందుతున్నారని టిడిపి చెప్పుకొచ్చింది. మహిళలకు ఆర్థిక స్వతంత్రత ఎంత ముఖ్యమో ఆమె ఉదాహరణగా చూపిస్తోంది. సమాజంలో మహిళలు ఒక స్థానం సంపాదించుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే సాయం, వ్యక్తిగత పట్టుదల కలిస్తే ఎలా మార్పు వస్తుందో ఈ కథే నిరూపిస్తోంది.

టిడిపి ట్వీట్‌లో ప్రశంసలు
భవానీ కథను టిడిపి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో కూడా పంచుకున్నారు. ఇంటికే పరిమితమైన ఓ మహిళ.. ఇప్పుడు తన బైక్‌పై దూసుకుపోతూ తన కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఇదే నిజమైన మహిళా సాధికారత అని పార్టీ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ చూసిన తర్వాత ఆమెకు ప్రాంతీయ స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది.

ఇతర మహిళలకు సందేశం
జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వెనక్కి తగ్గకూడదు. ఏదో ఒక అవకాశం ఉంటుంది. దాన్ని పట్టుకుని కష్టపడి పనిచేస్తే మార్పు తప్పదు. ఇప్పుడు మా కుటుంబం ఆర్థికంగా బలపడింది. సమాజంలో కూడా నాకు గౌరవం పెరిగింది. ఇతర మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రావాలని ఆ వీడియోలో భవానీ పిలుపునిచ్చింది.

విజయవాడ వీధుల్లో బైక్ నడిపే భవానీ ఇప్పుడు ఆర్థిక స్వాతంత్ర్యం, మహిళా సాధికారతలకు ప్రతీకగా నిలిచింది. భర్త అనారోగ్యంతో ఇంటి ఆర్థిక పరిస్థితి కుప్పకూలినా, స్వయం సహాయక సంఘం, ప్రభుత్వ మద్దతు, తన కష్టపడే ధైర్యం ఆమె జీవితాన్ని కొత్త దారిలో నడిపించింది. మహిళా సాధికారతను అందరికీ చేరేలా చేసే ఈ కథ, ప్రతి మహిళా కోసం ఒక స్ఫూర్తి మూలంగా నిలుస్తోంది.

Related News

Vijayawada Loan Scam: బెజవాడలో కిలాడీ లేడీ.. లోన్లు ఇప్పిస్తానని రెండువేల మందికి టోకరా

AP Govt decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాలపై బిగ్ ప్లాన్.. అదేమిటంటే?

India pension plan: 60 ఏళ్ల తర్వాత కూడా టెన్షన్ ఫ్రీ.. ఈ సూపర్ స్కీమ్ మీకు తెలుసా!

CM Chandrababu: మంత్రులకు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

Free bus scheme: ఏపీలో ఫ్రీ బస్ “చిత్రాలు”.. తెలుసుకుంటే టెకననాలజీ అనేస్తారు!

Big Stories

×