E-Paper
Advertisement

Professor Harassment: ‘పేపర్లు లీక్ చేస్తా డార్లింగ్’.. విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్ అరెస్టు

Professor Harassment: ‘పేపర్లు లీక్ చేస్తా డార్లింగ్’.. విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్ అరెస్టు
Advertisement

Professor Harassment: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఒక ప్రొఫెసర్.. విద్యార్థిని పట్ల వక్రబుద్ధితో ప్రవర్తించాడు. పరీక్షా పేపర్లను లీక్ చేస్తానంటూ.. సదరు విద్యార్థినికి అసభ్యకర మెసేజ్‌లు పంపి వేధింపులకు గురిచేశారు. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు ప్రొఫెసర్ ను శనివారం అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే..

బాధిత విద్యార్థిని లక్నో యూనివర్సిటీ పరిధిలోని జంతుశాస్త్ర విభాగంలో బీ.ఎస్సీ చదువుతోంది. అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న పరమ్ జిత్ సింగ్ గత కొంతకాలంగా ఆమెపై కన్నేశాడు. పరీక్షల్లో మంచి మార్కులు వేస్తానని.. రాబోయే పరీక్షల క్వశ్చన్ పేపర్లను ముందే ఇస్తానని ఆశ చూపుతూ ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ‘నీ కోసం క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తాను, డార్లింగ్’ అంటూ పంపిన మెసేజ్‌లు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Advertisement

పోలీసులకు ఫిర్యాదు..

ప్రొఫెసర్ నుంచి వస్తున్న అసభ్యకర మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌తో సదరు విద్యార్థిని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. మొదట్లో భయపడినప్పటికీ.. ప్రొఫెసర్ వేధింపులు మితిమీరిపోవడంతో ఆమె ధైర్యం చేసి లక్నోలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను లొంగదీసుకోవడానికి ప్రొఫెసర్ ప్రయత్నిస్తున్నాడని.. అందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను కూడా ఆమె పోలీసులకు సాక్ష్యాలుగా సమర్పించింది.

ప్రొఫెసర్ అరెస్టు..

Advertisement

విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదుతో ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు ప్రొఫెసర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మహిళలపై వేధింపులు, ఐటీ చట్టం ఉల్లంఘనల కింద కేసు బుక్ చేసి, శనివారం ఉదయం పరమ్ జిత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని.. గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.

Also Read: శంషాబాద్‌కు గట్టి పోటీ.. స్మార్ట్ టెర్మినల్, 2.5 కి.మీ భారీ రన్‌వే.. వరంగల్ ఎయిర్‌పోర్ట్‌ విశేషాలివే!

యూనివర్సిటీ సీరియస్

మరోవైపు విద్యార్థినిని ప్రొఫెసర్ వేధించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో సదరు యూనివర్శిటీ ఘటనపై స్పందించింది. దీనిపై అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. నివేదిక రాగానే ఆయన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని వర్సిటీ వైస్ ఛాన్సలర్ స్పష్టం చేశారు. విద్యార్థినుల రక్షణకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

Also Read: BSNL నమ్మశక్యం కాని ఆఫర్.. 330 రోజుల పాటు.. అపరిమిత కాల్స్, డేటా!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×