Kerala Crime : కేరళలో జీవ సమాధీ పొందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవ సమాధి పొందారని చెబుతున్న చోటు నుంచి కుటుంబ సభ్యులు, స్థానికుల ప్రతిఘటన మధ్యే సమాధిని తవ్వ ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. ఇప్పుడు ఈ ఘటన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆసక్తి పెరిగిపోయింది.
కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవ సమాధి జనవరి 9న జీవి సమాధి చెందారని చెబుతూ.. అతని కుటుంబ సభ్యులు రహస్యంగా పూడ్చిపెట్టేశారు. ఇరుగుపొరుగు వారికి కానీ, బంధువులకు కానీ చెప్పకుండానే.. దేవాలయానికి సంబంధించిన ఓ ఖాళీ స్థలంలో సమాధీ చేశారు. ఈ విషయమై.. ఆయన కుటుంబ సభ్యులు గోపన్ స్వామి అలియాస్ మణ్యన్ జీవ సమాధి అయ్యారని తెలుపుతూ కొన్నిరోజుల క్రితం పోస్టర్లు ప్రచురించారు. దాంతో.. విషయం క్రమంగా అందరికీ తెలిసి ఆశ్చర్యపోయారు. నిజంగా అలాంటిదే జరిగితే.. ఎందుకు ఎవరికీ చెప్పలేదనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన మృతదేహాన్ని ఎవరూ చూడకుండా సమాధి చేయాలని తమ తండ్రి చెప్పారని గోపన్ కుమారులు సనందన్, రాజేశన్, ఆయన భార్య సులోచన తెలుపుతున్నారు. కాగా.. ఆయనను ఏదైనా చేసి కుటుంబ సభ్యులే సమాధి చేసి ఉంటారంటూ స్థానికులు కొంత మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. ఎంక్వైరీ మొదలుపెట్టిిన పోలీసులు.. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాలతో సమాధి నుంచి మృతదేహాన్ని తీసేందుకు ప్రయత్నించారు. కానీ.. కుటుంబ సభ్యులు, స్థానికుల ఆందోళనల నేపథ్యంలో.. ప్రభుత్వ యంత్రాంగం.. హైకోర్టును ఆశ్రయించింది.
గోపన్ స్వామి కుటుంబ సభ్యులు మత స్వేచ్చపై తమకు ప్రాథమిక హక్కు ఉందని, వారి సొంత పద్ధతుల ప్రకారం ఆయన భౌతిక కాయాన్ని ఖననం చేసేందుకు వీలుంటుందని వాదించారు. కానీ.. ఏ వ్యక్తి మరణానికి సంబంధించి అయినా మౌఖికంగా విచారించి, కేసు నమోదు చేసుకునే హక్కు పోలీసులకు ఉంటుందని హైకోర్టు తెలిపింది. అలాగే.. ఆయన మృతిపై.. మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని, లేదంటే ఆయన మరణాన్ని ఎలా ధృవీకరించాలని హైకోర్టు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నించిందు. పోలీసుల ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారని, మీ సమస్య ఏంటని ప్రశ్నించింది. అతను ఎలా చనిపోయాడని, మరణం ఎక్కడ నమోదైందో చెప్పాలని జస్టిస్ సీఎస్ డయాస్ ప్రశ్నించారు. బీఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 194 ప్రకారం అనుమానాస్పద స్థితిలో మరణం సంభవించినప్పుడు హత్యగా భావించి దర్యాప్తు చేసే హక్కు పోలీసులకు ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
కుటుంబీకుల నిరసనలు, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో.. మృతదేహాన్ని వెలికితీసే ప్రయత్నాలు నిలిచిపోయాయి. సబ్ కలెక్టర్, పోలీసులు చర్చలు జరిపినా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దాంతో.. ఉదయం 7 గంటల భారీ భద్రతతో సమాది స్థలానికి వచ్చిన పోలీసులు.. కాంక్రీటుతో నిర్మించిన గోపన్ స్వామి సమాధిని తవ్వారు. అందులో నుంచి గోపన్ స్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. గోపన్ స్వామి సమాధిలో ధ్యాన స్థితిలోనే ఉన్నారని, ఆయన ఛాతి వరకు పూజా సామగ్రిలో నింపేశారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి తరలించారు. కాగా.. ఇప్పటి వరకు ఆయన మృతదేహంపై ఎలాంటి అనుమానాస్పద గాట్లు, గుర్తులు కనిపించలేదని వైద్యులు ప్రాథమికంగా తేల్చినట్లు సమాచారం.
Also Read : కర్ణాటకలో మరో బ్యాంకు దోపిడి.. రూ.15 కోట్ల బంగారం, రూ.5 లక్షల నగదు చోరి
ఆయన మరణాన్ని సహజ మరణంగానే కనిపిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. అయితే.. పూర్తి స్థాయి పోస్టు మార్టం నివేదిక ఇంకా చేతికందాల్సి ఉంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత కానీ ఏమీ చెప్పలేమని పోలీసులు అంటున్నారు.