Painkiller: పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల ఏ రకమైన నొప్పి నుండి అయినా వెంటనే ఉపశమనం లభిస్తుంది. కానీ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల అనేక ఇతర సమస్యలు కూడా వస్తాయి.
తలనొప్పి, కాళ్ళ నొప్పులు లేదా తేలికపాటి జ్వరం నుండి తక్షణ ఉపశమనం పొందడానికి పెయిన్ కిల్లర్లను వాడే వారు చాలా మందే ఉంటారు. వీటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మనందరికీ తెలుసు. అయినప్పటికీ వాడటం మాత్రం అస్సలు తగ్గించరు. ఎలాంటి అనారోగ్య సమస్య ఎదురైనా పెయిన్ కిల్లర్లను వాడటానికి బదులుగా ముందుగానే హోం రెమెడీస్ వాడటం అలవాటు చేసుకోవాలి. పసుపు, లవంగాలు మొదలైనవన్నీ నేచురల్ పెయిన్ కిల్లర్స్. వీటిని వాడటం వల్ల తక్షణమే రిజల్ట్ ఉంటుంది.
తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, జ్వరం, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడే వారు చాలా మందే ఉంటారు. కానీ అది మీకు హాని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. పెయిన్ కిల్లర్లు మీకు తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి . కానీ తాత్కాలికంగా మీకు సమస్యలను సృష్టిస్తాయి.
డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చిరాకు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
పెయిన్ కిల్లర్ దుష్ప్రభావాలు:
1. కడుపు, జీర్ణ సంబంధిత సమస్యలు
నిరంతర కడుపు నొప్పి, గ్యాస్, వికారం.
వాంతి లేదా నలుపు రంగు మలంలో రక్తం.
2. కాలేయం , మూత్రపిండాలపై ప్రభావం
మూత్రం తగ్గడం లేదా నల్లబడటం.
కళ్ళు లేదా చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు).
అలసటగా లేదా బలహీనంగా అనిపిస్తుంది.
3. గుండె, రక్తపోటుకు సంబంధించిన సమస్యలు
వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందనలు.
ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
4. అలెర్జీ , చర్మ సంబంధిత లక్షణాలు
చర్మంపై దద్దుర్లు, దురద, వాపు.
అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం లేదా గొంతులో వాపు.
5. దీర్ఘకాలిక ప్రభావం
ఆకలి లేకపోవడం.
ఆకస్మిక బరువు తగ్గడం.
తరచుగా తలనొప్పి లేదా మైకము.
Also Read: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. ఇది ఒక్క సారి వాడండి చాలు
ఏమి చేయాలి:
ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ సలహా లేకుండా నొప్పి నివారణ మందులను ఉపయోగించకూడదు. ఎక్కువ కాలం వాటిని తీసుకోవడం మానుకోండి.