Nellore Crime: నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రాంతంలో.. ఆదివారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. హమీద్ అనే వ్యక్తిని అతని సొంత బావనే కత్తులతో నరికి చంపిన సంఘటన.. స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబ సంబంధాల ముసుగులో దాగి ఉన్న విభేదాలు చివరికి ప్రాణాల మీదికి తీసుకొచ్చాయి. ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.
ఘటన ఎలా జరిగింది?
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో హమీద్, హనీఫ్, ఉమర్ అనే ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్‌ను.. ఉమ్మడి భాగస్వామ్యంగా నిర్వహించేవారు. అయితే ఇటీవల ఈ ఫంక్షన్ హాల్ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో పార్ట్‌నర్స్ మధ్య విభేదాలు తలెత్తాయి. హమీద్ తన వాటా తనకు ఇవ్వకుండానే.. ఇతరులతో పంక్షన్ హాల్‌ను నడుపుతున్నాడని తాళాలు వేశాడు. ఈ విషయంపై చర్చించేందుకు హనీఫ్, ఉమర్ ఘటనా స్థలానికి వచ్చారు.దీంతో ఆవేశంతో హనీఫ్, ఉమర్.. అందరి సమక్షంలో రాడ్లు, కత్తులతో హమీద్‌పై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన హమీద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
సొంత బావను దారుణంగా
ఈ వివాదం చివరకు తీవ్రంగా మలుచుకుని, ఆదివారం రాత్రి హమీద్‌పై దాడికి దారి తీసింది. బాధితుడు ఒంటరిగా ఉన్న సమయంలో.. కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటన స్థలంలో రక్తపు మరకలు కనిపించాయి. సంఘటన జరిగిన అనంతరం దుండగుడు పరారయ్యాడు.
పోలీసులు స్పందన
హత్య విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసిన పోలీసులు, హమీద్ ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
కుటుంబ సభ్యుల ఆవేదన
హమీద్ మృతితో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరికీ చిన్నచిన్న అభిప్రాయ భేదాలే ఉన్నాయి కానీ, ప్రాణాలు తీసుకునేంత కక్ష ఉందని ఊహించలేదని.. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. హమీద్ భార్య, పిల్లలు ఈ వార్తను జీర్ణించుకోలేక విలపిస్తున్నారు.
ప్రజా స్పందన
ఈ సంఘటన ఉదయగిరి ప్రజల్ని తీవ్రంగా కుదిపేసింది. బంధుత్వం పేరుతో అత్యంత క్రూరంగా ప్రవర్తించడం చాలా దారుణం. పోలీసులు శీఘ్రంగా నిందితుడిని పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: గొయ్యిలో పడి 6 ఏళ్ల బాలుడు.. రాజమండ్రిలో దారుణం
కుటుంబ సంబంధాలు ఒకప్పుడు సన్నిహితంగా ఉండేవి. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వివాదాలకు తావులేకుండా జీవించే వారు. ఇప్పడు కుటుంబ సంబంధాల ముసుగులో దాగి ఉన్న విభేదాలు చివరికి ప్రాణాల మీదికి తీసుకొస్తున్నాయి.భూమి, ఆస్తి, వ్యాపార తగాదాలతో ఒకరినొకరు చంపుకొని మానవ సంబందాలను ప్రశ్నర్థకంగా మారుస్తున్నారు అలాంటి ఘటనే నెల్లూరు జిల్లా ఉదయగిరి ఫంక్షన్ హాల్‌లోచోటుచేసుకుంది. ఓ ఫంక్షన్ హాల్ వివాధంలో హమీద్ అనే వ్యక్తిని అతని సొంత బావనే కత్తులతో నరికి చంపారు.