E-Paper
Advertisement

Medipalli Case: ప్రియుడి మోజులో భర్తను చిదిమేసిన భార్య.. మేడిపల్లి హత్య కేసులో విస్తుపోయే నిజాలు!

Medipalli Case: ప్రియుడి మోజులో భర్తను చిదిమేసిన భార్య.. మేడిపల్లి హత్య కేసులో విస్తుపోయే నిజాలు!

Medipalli Case: మేడిపల్లి అశోక్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు మహేష్ తో కలిసి దాడి చేసి భర్త అశోక్ ని హత్య చేసింది భార్య పూర్ణిమ. ఇంటి పక్కన అద్దెకు ఉండే పాతికేళ్ల యువకుడు మహేష్ తో పూర్ణిమకు వివాహేతర సంబంధముంది. పూర్ణిమకు పదకొండేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. మహేష్ తో పూర్ణిమకు శారీరక సంబంధముందని తెలియడంతో ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలయ్యాయి. తన భార్య పూర్ణిమ తీరు మార్చుకోమని భర్త అశోక్ హెచ్చరించినట్టు చెబుతున్నారు పోలీసులు.

విషయం భర్తకు తెలిసిపోవడంతో.. ఎలాగైనా సరే అతడ్ని హతమార్చాలన్న నిర్ణయానికి వచ్చింది భార్య పూర్ణిమ. ప్రియుడు మహేష్ తో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసిందని అంటున్నారు పోలీసులు. హాల్ లో అశోక్ ని హత్య చేసి, పైన బెడ్ రూమ్ లో మృతదేహాన్ని ఉంచారు పూర్ణిమ, మహేష్. అశోక్ సోదరికి హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోయినట్టు చె్పింది పూర్ణిమ. సోదరి వచ్చి చూసే సరికి.. బెడ్ పై పడి ఉన్నాడు అశోక్. అతడి ఒంటిపై గాయాలను గమనించింది అతడి సోదరి. దీంతో తన వదినెను ప్రశ్నించిందామె. బాత్రూంలో జారిపడిపోయాడనీ.. అబద్ధాలు చెప్పింది పూర్ణిమ. అశోక్ మృతదేహం పోస్టుమార్టం జరక్కుండా అడ్డుకునే యత్నం చేసింది. మహేష్ కూడా ఆస్పత్రికి వచ్చి పోస్టుమార్టం వద్దని అశోక్ కుటుంబ సభ్యులకునచ్చ చెప్పే యత్నం చేయడంతో అనుమానం మరింత బలపడింది.

పోలీసులకు సమాచారం అందడంతో పూర్ణిమను అదుపులోకి తీస్కుని విచారించారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రియుడు మహేష్ తో కలిసి.. తన భర్తను హత్య చేసినట్టు ఒప్పుకుంది పూర్ణిమ. ఆదివారం నాటితో అశోక్ దశ దిన కర్మ పూర్తి కాగా.. ఈ పది రోజుల పాటు అదంతా సహజమరణమే అన్నట్టుగా మేనేజ్ చేయగలిగింది పూర్ణిమ. ఈ పది రోజుల్లో మహేష్ తో చాట్ చేసినట్టు గుర్తించారు పోలీసులు. మూడు రోజుల క్రితం మహేష్ తో కలసి పూర్ణిమ షాపింగ్ కి సైతం వెళ్లినట్టు తెలుస్తోంది.

Also Read: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. భారీ స్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఇంకా ఎన్ని రోజులంటే!

ఈ హత్య కేసులో మొత్తం ముగ్గురు అరెస్ట్ అయ్యారు. భార్య పూర్ణిమతో పాటు మహేష్ తో పాటు సాయిని సైతం అరెస్టు చేశారు పోలీసులు. మూడు చున్నీలను అశోక్ మెడకు బిగించి మరీ.. పూర్ణిమ తన భర్త మహేష్ ని హతమార్చినట్టు గుర్తించారు పోలీసులు. అశోక్ మృతిపై తొలి నుంచి కుటుంబ సభ్యులకు అనుమానమే. పూర్ణిమ తీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆమెను నిలదీశారు. ఇంట్లో డెడ్ బాడీ ఉన్న టైంలోనే మహేష్ రావడం గుర్తించారు. కేసు, పోస్టుమార్టం వద్దంటూ అతను కుటుంబ సభ్యలను వారించడం గమనించారు. అశోక్ మెడ, బుగ్గలపై గాయాలుండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో దర్యాప్తు మొదలైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా.. మహేష్, సాయి ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు గుర్తించారు. మహేష్ తో గత కొంత కాలంగా పూర్ణిమకు వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగినట్టుగానూ తెలుసుకున్నారు. అందువల్లే పూర్ణిమ తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకరచన చేసినట్టు తేల్చారు పోలీసులు.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×