Travels Bus Incident: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గామన్ బ్రిడ్జి వద్ద బుధవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న RRR ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. బస్సు ఇంజిన్‌లో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
డ్రైవర్ అప్రమత్తంతో 10 మంది ప్రయాణికులు సేఫ్
అయితే ప్రమాద సమయంలో బస్సులో సుమారు 10 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు క్యాబిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్, వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ త్వరగా కిందకు దిగిపోవాలని సూచించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ప్రాణనష్టం తప్పిందని, లేదంటే ప్రమాదం మరింత తీవ్రంగా ఉండేదని స్థానికులు పేర్కొన్నారు. అయితే, ప్రయాణికుల సామాగ్రి మాత్రం మంటల్లో కాలిపోయినట్లు సమాచారం.
బస్సు దగ్ధం కావడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
ఈ ఘటనతో కొవ్వూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులో కొవ్వూరుకు తరలించి అక్కడి నుండి వారి గమ్య స్థానాలకు పంపేలా ఏర్పాట్లు చేశారు. బస్సు పూర్తిగా కాలిపోయి అస్థిపంజరంలా మారడంతో, క్రేన్ సహాయంతో వాహనాన్ని రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
Also Read: వరంగల్ జిల్లాలో విషాదం.. ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..
మంటల్లో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో బస్సు ప్రమాదం
ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్లుండి మంటలు
ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే కిందికి దిగడంతో తప్పిన పెను ప్రమాదం
ప్రమాదానికి గల కారణాలు… pic.twitter.com/bMcmWSScqW
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026