E-Paper
Advertisement

Student Suicide: వరంగల్ జిల్లాలో విషాదం.. ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..

Student Suicide: వరంగల్ జిల్లాలో విషాదం.. ఉరేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య..
Advertisement

Student Suicide: వరంగల్ జిల్లా మామునూరు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు తీవ్ర కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన వంశీ వర్మ, బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. మామునూరులోని ఒక అద్దె గదిలో నివాసముంటున్న అతను, బుధవారం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.

గది నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కుమారుడు ఇలా విగతజీవిగా మారడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే గత వారం నూతన సంవత్సర వేడుకల కోసం తన స్వగ్రామమైన పెద్దపల్లికి వెళ్లిన వంశీ వర్మ, రెండు రోజుల క్రితమే తిరిగి వరంగల్‌కు చేరుకున్నాడు. గ్రామం నుంచి వచ్చిన కొద్ది కాలానికే అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Also Read: వెనిజులా కథ క్లోజ్.. ట్ంప్ నెక్స్ట్ టార్గెట్ ఆ దేశమేనా!

Advertisement

ప్రస్తుతం మామునూరు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి వ్యక్తిగత సమస్యల వల్ల ఒత్తిడికి లోనయ్యాడా లేదా ఇతర ఆర్థిక, విద్యా సంబంధిత కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గదిలో ఏవైనా ఆత్మహత్య లేఖలు (Suicide Note) లభ్యమయ్యాయా అన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒక ఆశాకిరణంలా ఎదగాల్సిన విద్యార్థి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం తోటి విద్యార్థులను, అధ్యాపకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×