BigTV English

Visakha Honey-trap Case: జాయ్ జమీమా కేసులో దిమ్మ తిరిగే నిజాలు,

Visakha Honey-trap Case: జాయ్ జమీమా కేసులో దిమ్మ తిరిగే నిజాలు,

Visakha Honey-trap Case: విశాఖలో వెలుగు చూసిన హనీ ట్రాప్ కేసులో విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. తనను రేప్ చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడి రివర్స్ కేసు పెట్టింది. ఆమెపై విశాఖలో దాదాపు ఎనిమిది కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.


విశాఖలో వెలుగు చూసిన హనీ ట్రాప్ కేసులో విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. జాయ్ జమీమా టార్గెట్ ధనవంతులు, అధికారులు, ఎన్నారైలు. అందమైన ఫోటోలను ఆయా వ్యక్తులకు పంపి వారిని ట్రాప్ చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఆ తర్వాత రూమ్‌కి పిలిపించుకుని వారికి మత్తు మందు ఇచ్చి నగ్నంగా ఫోటోలు చిత్రీకరించి వారి నుంచి డబ్బులు వసూలు చేసింది.

జాయ్ జమీమా బాధితులు దాదాపు 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో వ్యాపారవేత్తలు, ఎన్నారై, పోలీసులు, నేవీ అధికారులున్నట్లు అంతర్గత సమాచారం. ఇప్పటివరకు 8 మంది మాత్రమే బయటకు వచ్చారు. త‌మ‌ కేసు వివరాలు బయటకు వస్తాయనే భ‌యంతో నేరుగా సీపీ శంఖబ్రత భాగ్జికి ఫిర్యాదు చేశారు కొంద‌రు బాధితులు.


విచిత్రం ఏంటంటే తనను రేప్ చేశాడంటూ 10 నెలల కిందట బాధితుడిపై పీఎం పాలెం పోలీసుస్టేషన్‌లో రివర్స్ కేసు పెట్టిందామె. ఆమెపై విశాఖలో ఎనిమిది కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జైలులో ఉన్న ఆమె, పోలీసు కస్టడీకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు పోలీసులు. న్యాయస్థానంలో పిటిషన్ వేయనున్నారు.

ALSO READ: కొండా సురేఖపై నాగార్జున ఫైల్ చేసిన కేసుకు ఎన్నేళ్ల జైలు శిక్ష? సెక్షన్ 356 BNS చట్ట ప్రకారం ఎలాంటి చర్యలుంటాయి?

రెండేళ్ల కిందటి నుంచే హనీ ట్రాప్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మూడు పెళ్లిళ్లు, నాలుగు ఎంగేజ్‌మెంట్లు జరిగాయి. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వ్యక్తి ఓ ఎన్నారై కాగా, ఆయనొచ్చి నేరుగా భీమిలి పీఎస్‌లో కేసు పెట్టాడు. మరోవైపు ఈమెకు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు ఖాకీలు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×