E-Paper
Advertisement

Prasanth Varma: అప్పుడు ‘హనుమాన్’, ఇప్పుడు ‘మహాకాళి’.. మాట నిలబెట్టుకున్న యంగ్ డైరెక్టర్

Prasanth Varma: అప్పుడు ‘హనుమాన్’, ఇప్పుడు ‘మహాకాళి’.. మాట నిలబెట్టుకున్న యంగ్ డైరెక్టర్
Advertisement

Prasanth Varma: సినిమాటిక్ యూనివర్స్‌లు అనేవి ఇండియన్ సినిమాల్లో చాలా అరుదు. సీనియర్ డైరెక్టర్లు అయినా ఇలాంటి సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి అంత సాహసం చేయలేరు. ఎందుకంటే అందులో ఒక్క సినిమా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయినా.. సినిమాటిక్ యూనివర్స్ మొత్తంపై ఎఫెక్ట్ పడుతుంది. అదంతా తెలిసిన ఒక యంగ్ డైరెక్టర్.. తన పేరుతోనే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను ప్రారంభించాడు. తనే ప్రశాంత్ వర్మ. ప్రశాంత్మ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో తను స్టార్ట్ చేసిన యూనివర్స్‌లో ఇప్పుడు మూడో సినిమా తెరకెక్కనుంది. తాజాగా దానికి సంబంధించి అఫీషియల్ వీడియో కూడా విడుదల చేశాడు.

వారిపైనే సినిమా

Advertisement

తేజ సజ్జా లాంటి యంగ్ హీరోతో ‘హనుమాన్’ సినిమాను తెరకెక్కించి ప్రపంచమంతా తనవైపు తిరిగి చూసేలా చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో ‘హనుమాన్’ గురించి ఎంత గొప్పగా చెప్పినా, ఎంత నమ్మకంతో ఉన్నా చాలామంది తన మాటలను పట్టించుకోలేదు. కానీ విడుదలయిన మొదటి రోజు నుండి ప్రేక్షకులను మెప్పిస్తూ వరల్డ్ వైడ్‌గా ‘హనుమాన్’కు వచ్చిన రీచ్ అంతా ఇంతా కాదు. ‘హనుమాన్’ విడుదలయిన తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి మరెన్నో సినిమాలు వస్తాయని, అవన్నీ హిందువుల దేవుళ్ల మీదే ఆధారపడి ఉంటాయని ప్రేక్షకులకు మాటిచ్చాడు ప్రశాంత్. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నాడు.

Also Read: పిటీషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ.. కొలిక్కి రానుందా..?

Advertisement

దర్శకుడిగా కాదు

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుండి రానున్న మూడో ప్రాజెక్ట్ గురించి తాజాగా అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. ‘నవరాత్రి సందర్భంగా నేను ఒక స్పెషల్ విషయం షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను. ఆర్కేడీ స్టూడియోస్‌తో కలిసి ఒక కనిపించని వారియర్, మంచిని కాపాడే రక్షకురాలు, చెడును నాశనం చేసే శక్తి కథను ప్రజెంట్ చేయబోతున్నాం. హనుమాన్ యూనివర్స్ నుండి మహాకాళి ఆగమనానికి సిద్ధంగా ఉండండి’ అంటూ తన తరువాతి ప్రాజెక్ట్ పేరు ‘మహాకాళి’ అని అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ ఈ సినిమాను తాను డైరెక్ట్ చేయడం లేదు. పూజా కొల్లూరు అనే ఫీమేల్ డైరెక్టర్‌ను రంగంలోకి దించుతున్నాడు.

ఆమె ఎవరు?

‘మహాకాళి’ అనౌన్స్‌మెంట్ కోసం ఒక స్పెషల్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశాడు. ‘ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ హీరో. ఆమె ప్రశాంతత, ఆమె ప్రళయం. ఆమె నిశ్శబ్ధం, ఆమె గర్జన. ఆమె సృష్టి, ఆమె విధ్వసం’ అని చెప్తూ ఆపై ‘మహాకాళి’ అనే టైటిల్ రివీల్ అయ్యింది. చివర్లో ఒక పులితో పాటు ఒక పాప కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు దర్శకులు, నిర్మాతలు ఎవరు అనే విషయం బయటపెట్టిన ప్రశాంత్ వర్మ.. క్యాస్టింగ్ విషయంలో మాత్రం సస్పెన్స్ మెయింటేయిన్ చేశాడు. చివర్లో కనిపించిన ఆ చిన్న పాప ఎవరు అనే విషయాన్ని కూడా రివీల్ చేయలేదు. దీంతో దేవుళ్లతోనే ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తానని మాటిచ్చిన ప్రశాంత్ వర్మ.. మొత్తానికి మాట నిలబెట్టుకొని చూపిస్తున్నాడని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×