E-Paper
Advertisement

Karnataka Crime: ఐదేళ్ల ప్రేమలో ఏం జరిగింది? ప్రియురాల్ని చంపి ఆపై ప్రియుడు, మరో విషయం ఏంటంటే..

Karnataka Crime: ఐదేళ్ల ప్రేమలో ఏం జరిగింది? ప్రియురాల్ని చంపి ఆపై ప్రియుడు, మరో విషయం ఏంటంటే..
Advertisement

Karnataka Crime: వారిద్దరు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు.. తర్వాత ఏం చెయ్యాలనేది  అసలు ప్రశ్న. ఒకరి వయస్సు 29 ఏళ్లు కాగా, యువకుడి వయస్సు 30 ఏళ్లు. ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. సంచలనం రేపిన ఈ ఘటన బళ్లారిలో వెలుగు చూసింది. అసలేం జరిగింది.

విశాఖలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Advertisement

బళ్లారి పట్టణంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళముఖి సుహాసిని వయస్సు 29 ఏళ్లు, ట్రాన్స్‌జెండర్ కూడా. బళ్లారి తాలూకా చాగనూరు గ్రామానికి చెందినది. సుహాసినిని శేఖర్‌ అలియాస్‌ మణి ప్రేమించాడు. ఈ యువకుడి వయస్సు 30 ఏళ్లు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గడిచిన ఆరేళ్లుగా వీరిద్దరు కలిసి హోస్‌పేటలో సహజీవనం చేస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ సుహాసిని గురించి చెప్పనక్కర్లేదు. భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో శేఖర్‌కు ఆటో కొనుగోలు చేసింది.

ఇద్దరు కలిసి ఇందిరానగర సమీపంలోని ఎంకె నగరలో అద్దెకు ఉంటున్నారు. ఈ విషయం శేఖర్ కుటుంబసభ్యులకు తెలీదు. 30 ఏళ్లు రావడంతో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సోమవారం హంపి ఉత్సవాల నేపథ్యంలో వీరిద్దరు బిజీగా ఉన్నారు. ఎప్పటి మాదిరిగా ప్రతివారం మంగళవారం బళ్లారిలోని కనక దుర్గమ్మ దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు మొదలయ్యాయి. చివరకు అది కాస్త తీవ్రరూపం దాల్చింది.

Advertisement

నిందితుడు అరెస్ట్.. ఆసుపత్రికి బాధిత చిన్నారి

దీనివల్ల ఇద్దరు కొన్నిరోజులు దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సుహాసిని ఇంటికి వచ్చినప్పుడు, శేఖర్ గొడవ పడ్డాడు. అది కాస్త హింసాత్మకంగా మారడంతో సుహాసినిని చంపాడు శేఖర్. ఆ తర్వాత ఆ యువకుడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శేఖర్‌ కిటికీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు సుహాసిని మృతి చెందింది. వీరిద్దరు డెడ్ బాడీలను గమనించిన స్థానికులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన బ్రూస్‌పేట పోలీసులు వీరిద్దరి కుటుంబసభ్యులను సమాచారం ఇచ్చారు. మృతదేహాలను బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. సుహాసిని చీరతో గొంతు బిగించి శేఖర్ హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత శేఖర్‌ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే సుహాసిని హత్యపై ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ షాకైంది. డబ్బుల కోసం సుహాసినిని పదేపదే వేధిస్తున్నాడని అంటోంది. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: విశాఖలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×