Anchor Sravanthi : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ స్రవంతి. ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ కు యాంకర్ కి వ్యవహరిస్తూ తన క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం సినిమా ఈవెంట్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెరపై శ్రీముఖి తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్రవంతి.. ఇటీవల ఎక్కువగా యాంకర్ స్రవంతి ఈవెంట్లే కనిపిస్తున్నాయి.. చూపతిప్పుకొని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమధ్య జరుగుతున్న సినీ ఈవెంట్లలో ఎక్కువగా సందడి చేస్తుంది..ట్రెండ్ కు తగ్గట్లు డ్రెస్ లతో పాటుగా అప్పుడప్పుడు ట్రెడిషినల్ టచ్ కూడా ఇస్తుంది. ఆ షో కే హైలెట్ అయ్యేలా రెడీ అవుతుంది.. అందుకు యూత్ ఆమెకు కనెక్ట్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది కూడా.. ఎప్పుడు హీరోలని సినిమా వాళ్ళని ఇంటర్వ్యూలు చేసే ఈ అమ్మడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో భాగంగా ఆమె విడాకులపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది.. ఇంతకీ స్రవంతి ఏం చెప్పిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర యాంకర్ అమ్మ స్రవంతి చొక్కారపు తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో భాగంగా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. అంతే కాదు తన ఆస్తులు గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది.. వీటితో పాటుగా ఆమె విడాకుల గురించి వస్తున్న వార్తలు గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురవుతుంది. మీ విడాకుల గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.. వాటి గురించి మీరు ఎలా స్పందిస్తున్నారు అని యాంకర్ అడుగుతారు.. ఆ మాట వినగానే స్రవంతి ఎవరైనా అనుకున్నా అది వాళ్ళకే సంబంధించి ఉంటుంది నాకు మాత్రం సంబంధించి ఉండదు. మేము ఎప్పటికీ సంతోషంగానే ఉంటాము.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోనివ్వండి నేనేంటో నా కుటుంబం ఏంటో మా వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎవరేమన్నా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక్క మాటతో తేల్చి చెప్పేసింది.. నాకు ఇవాళ ఇంత ఫేము వచ్చింది అంటే నేను పడిన కష్టమే అని ఆమె నిర్మొహమాటంగా చెప్పేసింది… ఆ వీడియో వైరల్ అవ్వడంతో విడాకుల పై వస్తున్న వార్తలకు.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..
Also Read : మహాను మోసం చేసిన చక్రీ.. నిజాలు చెప్పిన నారాయణ.. లలిత ప్లాన్ వర్కౌట్..?
ప్రస్తుతం సినిమా ఈవెంట్లకు ఎక్కువగా స్రవంతి హోస్ట్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు యాంకర్ సుమ కోసం చిత్ర యూనిట్ వెయిట్ చేసేది. కానీ ఈమధ్య చిన్న సినిమాలకు క్రేజ్ పెరుగుతుండడంతో ఆ ఈవెంట్లకి సుమని కాకుండా యాంకర్ స్రవంతిని ఎక్కువగా పిలుస్తున్నారు.. దాంతో ఈమె క్రేజ్ కూడా రోజురోజుకీ పెరుగుతుందనే చెప్పాలి.. ఈవెంట్లు వచ్చేకొద్దీ ఈమె రెమ్యూనిరేషన్ కూడా భారీగా పెంచినట్లు ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. అయితే తాజాగా ఈమె పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె నెలకు ఆదాయం 7 నుంచి 8 లక్షల వరకు ఉంటుందని రివిల్ చేశాడు.. ఆ మాటకు స్రవంతి మీరు ఎలాగైనా అనుకోండి అంతే వస్తుంది అనుకున్న పర్వాలేదు నాకు అని నవ్వుతూ సమాధానం చెప్తుంది.. స్రవంతి ఒక నెలకు దాదాపు 10 లక్షల వరకు సంపాదిస్తుందని అర్థమైపోతుంది.. ఇక ఆమెపై వస్తున్న ట్రోల్స్ గురించి అయితే అసలు పట్టించుకోనట్లే ఉందని తెలుస్తుంది.. మొత్తానికి యాంకర్ స్రవంతి మరికొద్ది రోజులు పోతే టాప్ మోస్ట్ యాంకర్లలో ఒకటిగా మిగిలిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ నేటిజెన్లు ఆ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే యాంకర్ స్రవంతి ఈమధ్య సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. నటిగా అక్కడ ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో.. స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని పొందుతుందో లేదో చూడాలి.. ఇక యాంకర్ స్రవంతి ఈమధ్య సోషల్ మీడియాలో బాగా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతి పోగొట్టేలా చేస్తుంది..