E-Paper
Advertisement

Hanuman Chalisa: కష్టాల్లో ఉన్నారా? హనుమాన్ చాలీసా నేర్పే ఈ పాఠాలు మీకు ధైర్యాన్నిస్తాయి!

Hanuman Chalisa: కష్టాల్లో ఉన్నారా? హనుమాన్ చాలీసా నేర్పే ఈ పాఠాలు మీకు ధైర్యాన్నిస్తాయి!
Advertisement

Hanuman Chalisa: హనుమాన్ చాలీసా కేవలం ఒక భక్తి శ్లోకం మాత్రమే కాదు.. అది ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాస గ్రంథం. తులసీదాస్ రచించిన దీనిలో మనిషి విజయం సాధించడానికి కావాల్సిన సూత్రాలు దాగి ఉన్నాయి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించి, ధైర్యంగా ముందుకు సాగడానికి హనుమంతుని గుణాలు మనకు దిక్సూచిలా పనిచేస్తాయి. బలం, బుద్ధి, విజ్ఞానాల కలయిక అయిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన జీవన పాఠాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిరంతర అభ్యాసం, వినయం:
“విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరిబే కో ఆతుర”
ఈ పంక్తిలో హనుమంతుడిని విద్యావంతుడు, గుణవంతుడు, అత్యంత చతురుడు (తెలివైనవాడు) అని వర్ణించారు. ఆయనకు అన్ని శక్తులు ఉన్నప్పటికీ, శ్రీరాముడి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.
జీవన పాఠం: మనం ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకున్నా.. ఎన్ని డిగ్రీలు సంపాదించినా మనలో ‘వినయం’ ఉండాలి. నేర్చుకోవాలనే తపన ఎప్పుడూ చావకూడదు. తెలివితేటలకు అహంకారం తోడైతే పతనం తప్పదు. అదే వినయం తోడైతే విజయం వరిస్తుంది.

Advertisement

2. సందర్భాన్ని బట్టి మారడం:
“సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా | వికట రూప ధరి లంక జరావా”
సీతమ్మను కలిసినప్పుడు హనుమంతుడు చాలా చిన్న రూపంలో వెళ్లారు. అదే లంకను దహనం చేసేటప్పుడు భయంకరమైన పెద్ద రూపాన్ని ధరించారు.
జీవన పాఠం: జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి.. మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలియడమే అసలైన తెలివితేటలు. సమస్య చిన్నదైతే శాంతంగా, పెద్దదైతే అంతే ధైర్యంతో ఎదుర్కోవాలి. ఫ్లెక్సిబిలిటీ అనేది నేటి కాలంలో అత్యంత ముఖ్యమైన సాఫ్ట్ స్కిల్.

3. ఉత్తమ వినే గుణం, కమ్యూనికేషన్:
“ప్రభు చరిత్ర సునిబే కో రసియా | రామ లఖన సీతా మన బసియా”
హనుమంతుడు ఎప్పుడూ రామకథను వినడానికి ఇష్టపడేవారు. అందుకే ఆయన రామ లక్ష్మణ సీతల మనసులో స్థానం సంపాదించుకున్నారు.
జీవన పాఠం: మంచి నాయకుడిగా లేదా మంచి వ్యక్తిగా ఎదగాలంటే ముందు ‘మంచి శ్రోత’ కావాలి. ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా విన్నప్పుడే.. మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. తక్కువ మాట్లాడి.. ఎక్కువ వినడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది.ఇతరులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.

Advertisement

Also Read: ఒత్తిడిని మాయం చేసే ‘స్పటిక’.. ధరిస్తే కలిగే మార్పులివే!

4. అసాధ్యమైనది ఏదీ లేదు:
“దుర్గమ కాజ జగత కే జేతే | సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే”
ప్రపంచంలో ఎంతటి కష్టమైన పనైనా హనుమంతుడి కృప ఉంటే.. సులభం అవుతుందని దీని అర్థం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, సంజీవని పర్వతాన్ని మోయడం వంటి పనులు ఆయన ఆత్మ విశ్వాసానికి నిదర్శనం.
జీవన పాఠం: మనపై మనకు నమ్మకం ఉంటే.. అసాధ్యమైనది ఏదీ లేదు. భయం అనేది మన మనసు సృష్టించుకునే ఒక అడ్డంకి మాత్రమే. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, దైవచింతన (లేదా పాజిటివ్ మైండ్‌సెట్) ఉంటే.. ఎంతటి పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు.

హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా.. పైన చెప్పిన పాఠాలు మనల్ని ఒక పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. బలానికి బుద్ధి తోడైతే.. విజయం మీ సొంతం అవుతుందని హనుమంతుడి చరిత్ర చెబుతోంది. అందుకే ప్రతి రోజూ చాలీసా చదువుతూ.. అందులోని ధైర్యాన్ని, వినయాన్ని మన జీవితంలో కూడా ఆచరిద్దాం.

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×