BigTV English

Death Signs: గరుడ పురాణం ప్రకారం.. మరణానికి గంట ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయ్

Death Signs: గరుడ పురాణం ప్రకారం.. మరణానికి గంట ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయ్

Death Signs: హిందూమతంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణంలో మరణ రహస్యంతో పాటు మరణానంతర జీవితం గురించి కూడా వివరించడం జరిగింది. అంతే కాకుండా ఇందులో మహా విష్ణువుతో పాటు అతడి వాహనం గరుడ దేవుడి మధ్య జరిగిన సంభాషణల గురించి ప్రస్తావించబడింది.


మత విశ్వాసాల ప్రకారం గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వారికి మోక్షం కలుగుతుందని, అంతే కాకుండా వారి కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి మరణానికి ముందు  వచ్చే సంకేతాల గురించి గరుడ పురాణాల తెలియజేస్తుంది. గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు వ్యక్తి ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గరుడ పురాణంలో మరణ సంకేతాలు:


ఒక వ్యక్తి మరణానికి దగ్గరగా వచ్చినప్పుడు అతడు దానిని  ముందే గ్రహించడం ప్రారంభిస్తాడు. అవును, గరుడ పురాణంలో దీని గురించి ఒక రహస్యం చెప్పబడింది. దాని ప్రకారం ఒక వ్యక్తి తన మరణానికి కొన్ని గంటల ముందు తాను వెళ్లబోతున్నట్లు తెలుసుకుంటాడు.

గరుడ పురాణం ప్రకారం, మరణం సమీపిస్తున్న కొద్దీ, ఒక వ్యక్తి చేతిలో ఉన్న రేఖలు తేలికగా మారుతాయట. అదే సమయంలో, కళ్ళ ముందు చీకటి కనిపిస్తుందట.
మరణం సమీపించిన వెంటనే  కలలో తన పూర్వీకులను చూడటం ప్రారంభిస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది. అంతే కాకుండా తను గడిపిన మంచి రోజులను కూడా గుర్తు చేసుకుంటాడట. మరణం సమీపించిన వెంటనే ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని నూనె, నెయ్యి, గాజు లేదా నీటిలో చూడలేడు. నిజానికి నీడ మనల్ని విడిచి వెళ్ళిపోతుందట.

గరుడ పురాణం ప్రకారం, మరణం సమీపించిన వెంటనే, ఒక వ్యక్తి తన చుట్టూ ప్రతికూల శక్తుల ఉనికిని అనుభవించడం ప్రారంభిస్తాడట. తనను తీసుకెళ్లేందుకు యమదూత వచ్చాడని గ్రహిస్తాడు. అటువంటి పరిస్థితిలో అతని శరీరం నిర్జీవంగా మారుతుంది. అతను తన కోసం ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్తాడు.

ఇది మరణానికి ఒక గంట ముందు కనిపిస్తుంది:

గరుడ పురాణంలో ఒక వ్యక్తి మరణం సమీపించినప్పుడు, అతను ఒక గంట ముందు ఒక రహస్యమైన తలుపును చూడటం ప్రారంభిస్తాడని చెప్పబడింది. ఈ ద్వారం నుండి అగ్ని కిరణాలు వస్తాయట. ఈ తలుపును చూసినప్పుడు, ఒక వ్యక్తి తన జీవితంలో చేసిన అన్ని చెడు పనులను కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు.

యమదూత స్వరూపం:
గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి మరణానికి కొంత సమయం ముందు యమదూతలు కూడా కనిపిస్తారట. యమదూతను చూడడం వల్ల ఒక వ్యక్తి యొక్క కొన్ని శ్వాసలు ఆదా అవుతాయని నమ్ముతారు.

గరుడ పురాణం ఎప్పుడు పఠిస్తారు ?
ఇంట్లోఎవరైనా చనిపోయితే గరుడ పురాణం పఠిస్తారు. మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ 13 రోజులు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు. అందుకే గరుడ పురాణం పఠించే సంప్రదాయం ఉంది. ఇలా చేయడం వల్ల మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడట.

Also Read: గ్రహాల అరుదైన సంచారం.. డిసెంబర్ 26 నుంచి వీరికి తిరుగులేదు

గరుడ పురాణం పారాయణ నియమాలు..
గరుడ పురాణాన్ని చదివేటప్పుడు ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
ఇది పద్ధతిగా,మంచి హృదయంతో పఠించాలి.
గరుడ పురాణాన్ని పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదు.
దీని పారాయణానికి శుభ్రమైన బట్టలు ధరించాలి.
పారాయణం చేసేటప్పుడు ఎవరి గురించీ తప్పుగా ఆలోచించవద్దు.

Related News

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Goddess Durga: దుర్గాదేవిని ఈ ఎర్రటి పూలతో పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయ్ !

Sabarimala: శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.54 కేజీల బంగారం మాయం..

Navratri Gifts Ideas: నవరాత్రి స్పెషల్.. బహుమతులు ఇచ్చే క్రీయేటివ్ ఐడియాస్ మీకోసం

Navratri Fasting: నవరాత్రి తొమ్మిది రోజుల ఉపవాస రహస్యాలు.. తెలుసుకోవాల్సిన ఆహార నియమాలు

Navratri Fashion Trends 2025: నవరాత్రి 2025.. తొమ్మిది రోజుల తొమ్మిది రంగుల ప్రత్యేకత

Solar Eclipse 2025: 21న ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్!

Big Stories

×