BigTV English

3E – 3AC Train classes: 3E, 3 AC క్లాసుల మధ్య తేడాలివే, ఈ రెండిటిలో ఏది బెస్ట్ అంటే?

3E – 3AC Train classes: 3E, 3 AC క్లాసుల మధ్య తేడాలివే, ఈ రెండిటిలో ఏది బెస్ట్ అంటే?

Indian Railways: రైలు ప్రయాణం చేసే సమయంలో ఏ తరగతని సెలెక్ట్ చేసుకోవాలి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. ఎక్కువ మంది ఇష్టపడే 3E (థర్డ్ ఎకానమీ క్లాస్), 3AC (థర్డ్ AC క్లాస్)లో ఏది బెస్ట్ అనేది పెద్దగా తెలియదు. ఈ రెండూ స్లీపర్ క్లాస్‌లు అయినప్పటికీ ప్రత్యేక ఫీచర్లు, సౌకర్యాలు, ధరల్లో తేడాలు ఉన్నాయి. ఇంతకీ ఈ రెండింటి మధ్య తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


3E (మూడవ ఎకానమీ క్లాస్) అంటే..

ఈ క్లాస్ ప్రయాణీకులకు మరింత సరసమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. దీనిని థర్డ్ ఎకానమీ క్లాస్‌ గా సూచిస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే..


1.సీటింగ్

థర్డ్ AC ఎకానమీలో ఒక కంపార్ట్‌ మెంట్‌ కు 9 బెర్త్‌ లు ఉన్నాయి. ఇందులో సైడ్ మిడిల్ బెర్త్ లు కూడా ఉంటాయి. 3A క్లాస్‌లో ఒక్కో కంపార్ట్‌ మెంట్‌ లో 6 బెర్త్‌ లు, 2 సైడ్ బెర్త్‌ లు ఉంటాయి. కానీ,  3E క్లాస్‌ లో 3 సైడ్ బెర్త్‌ లు ఉంటాయి.  ఒక్కో కంపార్ట్‌ మెంట్‌ కు మొత్తం 9 బెర్త్‌ లు ఉంటాయి.

2.ఎయిర్ కండిషనింగ్

3E అనేది ఎయిర్ కండిషన్డ్ క్లాస్. 3ACతో పోలిస్తే ఎయిర్ కండిషనింగ్ స్థాయి సాధారణంగా ఉంటుంది. హై క్లాస్ కంపార్ట్‌ మెంట్ లా చల్లగా ఉండదు.

3.ఖర్చు తక్కువ

3E టికెట్ ధర తక్కువగా ఉంటుంది. 3ACతో పోల్చితే చాలా తక్కువ. నాన్-AC కోచ్ కంటే మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది.

4.బేసిక్ సౌకర్యాలు

3E క్లీన్ లినెన్లు, ఫ్యాన్లు, ఓవర్‌ హెడ్ స్టోరేజ్ లాంటి బేసిక్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. 3E కోచ్‌ లోని మొత్తం వాతావరణం లగ్జరీ టచ్‌ లేకుండా ఫంక్షనల్‌ గా ఉంటుంది.

3AC (థర్డ్ AC క్లాస్) ప్రత్యేకత ఏంటంటే..   

3AC అనేది దేశంలో సుదూర ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన క్లాస్. ఇది 3Eతో పోలిస్తే ఎక్కువ సౌకర్యాలతో పాటు వసతులను కలిగి ఉంటుంది.

1.సీటింగ్ విధానం

థర్డ్ ఏసీలో ఒక్కో కంపార్ట్‌మెంట్‌ కు 6 బెర్త్ లు, 2 సైడ్ బెర్త్‌ లు ఉన్నాయి. సైడ్ అప్పర్, సైడ్ లోయర్ మధ్య అదనపు బెర్త్‌ ను కలిగి ఉంది. ఈ కోచ్‌లు ప్రయాణీకులు నిద్రించడానికి బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్‌ లో బెడ్ షీట్లు, దుప్పట్లు, దిండ్లు అందిస్తారు.

2.బెటర్ కంఫర్ట్

3Eతో పోలిస్తే 3AC మరింత సౌకర్యవంతమైన సీటింగ్ ను కలిగి ఉంటుంది. 3ACలోని కంపార్ట్‌ మెంట్లు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా ఉంటాయి.

3.మెరుగైన సౌకర్యాలు

3ACలో ప్రయాణించే ప్రయాణీకులకు చక్కటి సౌకర్యాలను పొందుతారు. వీటిలో బెడ్‌ రోల్స్, దిండ్లు, వాటర్ బాటిళ్లు అందిస్తారు. 3Eతో పోల్చితే పరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది సుదీర్ఘ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

4.ధర  

3AC ధర 3E కంటే ఎక్కువ. 2AC, 1ACతో పోల్చితే తక్కువగానే ఉంటుంది.

ఏది సెలెక్ట్ చేసుకుంటే మంచిది?

తక్కువ దూరం ప్రయణం, డబ్బు ఖర్చు కాకూడదు అనుకుంటే 3Eను సెలక్ట్ చేసుకోవడం మంచిది. ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు మరిన్ని సౌకర్యాలు పొందాలంటే 3AC టికెట్ తీసుకోవడం మంచిది. రాత్రిపూట ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

Read Also: ఆ రైల్వే స్టేషన్లను మూసేస్తున్న ప్రభుత్వం.. క్లోజ్ చేయడానికి కూడా కొన్ని రూల్స్ పాటించాలని మీకు తెలుసా?

Related News

Panch Jyotirlinga Darshan: పంచ జ్యోతిర్లింగ దర్శనం.. సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభం!

Trains Cancelled: సికింద్రాబాద్ నుంచి ఆ రైల్లో వెళ్తున్నారా? అయితే, ఈ విషయం తెలియాల్సిందే!

Viral Video: చావుకు షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే ఇదే, సింహం తినే మూడ్ లో లేకపోతే..

Cherlapally Station: చర్లపల్లి స్టేషన్ కు అదనపు MMTS రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కీలక వ్యాఖ్యలు!

Rakhi Delivery on Trains: నేరుగా రైలు సీటు దగ్గరికే రాఖీలు, ఐడియా అదిరింది గురూ!

Visakhapatnam Expressway: టన్నెల్ ఒడిశాలో.. లాభం మాత్రం విశాఖకే.. ఎలాగంటే?

Big Stories

×