BigTV English

Brahmamudi : బ్రహ్మముడి బ్రహ్మదేవుడే వేస్తాడా….?

Brahmamudi : బ్రహ్మముడి బ్రహ్మదేవుడే వేస్తాడా….?

Brahmamudi : వివాహ సమయంలో వధూవరులిద్దరి చెంగులకు ముడివేసి ఆశీర్వదిస్తారు. ఈ ముడి సాక్షాత్తూ బ్రహ్మదేవుడే మంత్రోచ్ఛారణతో వేస్తాడు. జీవితాంతం కలిసి మెలిసి ఉండాలని బ్రహ్మదేవుడు వేయబడిన ముడి బ్రహ్మముడి. ఒకరి చేయి ఒకరు పట్టుకుని అగ్ని చుట్టూ ప్రదక్షణం చేసి కలిసి మెలిసి ఉంటామని మూడుసార్లు ప్రదక్షణ చేయడమే పాణిగ్రహణం.


పురోహితుని రూపంలో ఉన్న సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు వేసే ముడులే, బ్రహ్మముడులనీ, బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టి బ్రహ్మ ముడులు అని పెద్దలు చెబుతారు. మన శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో బ్రహ్మ గ్రంధి ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.

కంద పిలక, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరపు కాయ, చిల్లరనాణం కలిపి , వధూవరుల కొంగుకు కట్టి, ఇద్దరి కొంగులను కలిపి ముడి వేస్తారు. కంద ఒకచోట పాతితే దినదిన మూ వృద్ధి చెందుతూ, ఎకరాలకు ఎకరాలు వ్యాపిస్తూ పోతుంది. కందలాగా అనుదినమూ వారి బంధము వృద్ధి చెందుతూ, వంశ వృద్ధి చెందాలని కందను కడతారు.


చిల్లర నాణం లక్ష్మీస్వరూపం. అష్టైశ్వ ర్యాలతో వృద్ధి చెందాలని చిల్లర నాణం కడతారు. కంద పిలక, పసుపుకొమ్ము, ఖర్జూ రపుకాయ, ఆకు, వక్క, చిల్లరనాణం కలిపి పురోహితుడి రూపంలో ఉన్న సాక్షాత్‌ బ్రహ్మదేవుడే వేదమంత్రాల నడుమ పెద్దల ఆశీర్వ చనములతో ముడి వేస్తే, ఆ కాపురానికి తిరుగు లేదని మన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×