OTT Movie : అమెరికాలో హరికేన్ అంటేనే అక్కడి వాళ్ళకు ప్యాంట్లు తడిచిపోతుంటాయి. ఇది తీవ్రరూపం దాలిస్తే ఇక వినాశనమే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ సినిమా అదరగొడుతోంది. ఇందులో హరికేన్ తుఫాన్ కి తోడుగా మొసళ్ళు కూడా ఎంట్రీ ఇవ్వడంతో కథ ఉత్కంఠంగా నడుస్తుంది. ఈ భారీ అలిగేటర్ల నుండి తప్పించుకోవడానికి ఒక యువతి పోరాడే సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తాయి.
ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
మూడు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Crawl’ 2019 లో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా. దీనికి అలెగ్జాండ్రే అజా దర్శకత్వం వహించారు. ఇందులో కాయా స్కోడెలారియో, బారీ పెప్పర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 87 నిమిషాల రన్‌టైమ్‌తో, IMDbలో 6.1/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, టూబీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇది $15 మిలియన్ బడ్జెట్‌తో, $90 మిలియన్లు వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది.
హేలీ యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఒక కంపెటిటివ్ స్విమ్మర్. తన సోదరి బెథ్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఫ్లోరిడాకు కేటగిరీ 5 లో, వెండీ అనే హరికేన్ ముప్పు ఉందని, తండ్రి డేవ్ కూడా ఫోన్ ఎత్తడం లేదని చెప్తుంది. హేలీ, హరికేన్ హెచ్చరికలను లెక్కచేయకుండా, తన తండ్రిని వెతకడానికి కొరల్ లేక్‌లోని వాళ్ళ పాత ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమె తన తండ్రిని ఇంటి క్రాల్ స్పేస్‌లో తీవ్రంగా గాయపడిన స్థితిలో చూస్తుంది. అక్కడ భారీ అలిగేటర్లు తిరుగుతుంటాయి. హరికేన్ వల్ల నీటి వేగంగా కూడా పెరుగుతుంది. హేలీ, డేవ్, వీళ్ళ పెంపుడు కుక్క సుగర్‌లు కలిసి ఈ ప్రమాదకరమైన అలిగేటర్ల నుండి తప్పించుకోవడానికి పోరాడాల్సి వస్తుంది. హేలీ స్విమ్మింగ్ స్కిల్స్ ఆమెను కొన్ని సార్లు రక్షిస్తాయి. కానీ అలిగేటర్లు వారిని వెంబడిస్తూనే ఉంటాయి.
అక్కడ నీటి ఉధృతి పెరగడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఇద్దరు పోలీసులు రక్షించడానికి వస్తారు. కానీ అలిగేటర్లు వాళ్ళపై దాడి చేసి చంపేస్తాయి. హేలీ చనిపోయిన పోలీస్ బాడీ నుండి తుపాకీ తీసుకుని, ఒక అలిగేటర్‌ను దాని గొంతులో కాల్చి చంపుతుంది. హరికేన్ విజృంభిస్తున్న మూమెంట్‌లో వీళ్ళు బోట్‌లో ఎక్కడానికి ప్రయత్నిస్తారు. కానీ బోట్ బోల్తా కొట్టడంతో నీటిలో కొట్టుకుపోతారు. ఒక అలిగేటర్ దాడిలో డేవ్ తన చేయిని కోల్పోతాడు. కానీ హేలీ ఒక అలిగేటర్‌ను ఫ్లేర్‌తో కళ్లలో పొడిచి చంపుతుంది. చివరలో హేలీ, డేవ్, సుగర్ ఇంటి పైకప్పు మీదకు చేరుకుని, రెస్క్యూ హెలికాప్టర్ సహాయంతో బయటపడతారు. ఈ కథ ఇలాంటి భయంకరమైన సంఘటనలతో ముగుస్తుంది.
Read Also : పని మనిషిపై అంతులేని ప్రేమ… ఆ పాడు పని కోసం దిక్కుమాలిన ప్లాన్… ఇలాంటి గెస్ట్ ను ఎక్కడా చూసుండరు