BigTV English

Addiction: సప్త వ్యసనాలు.. ఏవో తెలుసా..?

Addiction: సప్త వ్యసనాలు.. ఏవో తెలుసా..?

Addiction: ఏ మనిషికైనా కొన్ని అలవాట్లుంటాయి. ఆ అలవాట్లు మానలేని దశకు చేరితే వాటిని వ్యసనాలు అంటారు. అయితే.. వీటిలో కొన్ని వ్యసనాలు తగవని మన పెద్దలు సూచించారు. వాటికే సప్త వ్యసనాలు అని పేరు. వీటికి లోనయిన వాడి బుద్ధి పూర్తిగా నశించి, జీవితంలో పతనం కావాల్సిందేనని మన పురాణాలు సైతం చెబుతున్నాయి. వాటి వివరాలు..


జూదం: ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్నో అగచాట్లు పడ్డాడు. తన వ్యసనం కారణంగా తన తమ్ములూ, భార్యా కూడా దారుణ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కనుక దీనికి దూరంగా ఉండాలి.

పరస్త్రీ వ్యామోహం: సీతను అపహరించిన రావణుడు దారుణంగా అంతమైనట్లే.. ఏ కాలంలోనూ మనిషి ఈ వ్యసనానికి గురికారాదు. దీనివల్ల అతనితో బాటు కుటుంబ పతనమూ తప్పదు.


మద్యపానం: రాక్షసుల గురువు, మహా బుద్ధిశాలి అయిన శుక్రాచార్యుడు. ఆయనకి మృతసంజీవినీ విద్య(చనిపోయిన వారిని తిరిగి బతికించే విద్య) తెలుసు. దీంతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అయితే.. మద్యం అలవాటున్న ఈ గురువు ఓసారి మద్యపానపు మత్తులో కచుడి వంటి వాడినీ బతికించి చివరకు తిప్పలు తెచ్చుకుంటాడు. నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే కనుక.. దీనిని వ్యసనంగా మారకుండా చూసుకోవాలి.

వేట: నోరులేని మూగజీవాలను చంపబోయిన రాముని తండ్రి దశరథుడు.. ముని కుమారుడిని చంపి శాపానికి లోనవుతాడు. దీంతో తన మరణ సమయంలో రామలక్ష్మణులు ఆయనకు దూరమవుతారు. ఈ రోజుల్లో ఇలాంటి వేట లేకున్నా.. జీవహింసకు దూరంగా ఉండటం మంచిది.

కఠినంగా, పరుషంగా మాట్లాడటం: దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడిన సుయోధనుడి ఎంత పతనమయ్యాడో మనకు తెలుసు. కనుక వీలుంటే ప్రేమగా మాట్లాడటం, అవసరం అయితే.. అవతలివారు నచ్చుకోని రీతిలోనే మందలించటం చేయొచ్చు. అదీవీలుకాకుంటే.. మౌనంగా ఉన్నా అది అవతలివారికి అర్థమవుతుంది.

కఠినంగా దండించటం: దీనికీ సుయోధనుడే మంచి ఉదాహరణ. సొంత మేనమామలను జైలులో పెట్టి, అన్నం పెట్టకుండా మాడ్చి చంపిన కారణంగా.. వారిలో బతికిన చివరి మేనమామ శకుని.. మేనల్లుడిని అన్ని విధాలా దిగజార్చి, చివరకు నాశనమయ్యేలా చేస్తాడు.

దుబారా ఖర్చు: చాలామంది దీనికారణంగా జీవితాలను పతనం చేసుకుంటున్నారు. దీనివల్ల ఎంత సంపద ఉన్నా వారు పతనావస్థకు లోనవుతున్నారు. కనుక అవసరాలు, సౌకర్యాలు.. ఆ తర్వాతే విలాసాల జోలికి పోవాలనేది పెద్దల మాట.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×