Temple – Diabetes: మీరు డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? ఏళ్ల తరబడి షుగర్ మిమ్మల్ని బాధిస్తుందా..? ఎన్ని మెడిసిన్స్ వాడిని షుగర్ తగ్గకపోవడం అటుంచితే కనీసం కంట్రోల్ కావడం లేదా..? అయితే షుగర్ పేషేంట్లకు అద్బుతవరంలా నిలుస్తుందో ఆలయం. అక్కడి దేవుడికి దండం పెట్టుకుని నైవేద్యం పెడితే మీ షుగర్ పరార్ అవుతుందట. ఈ విషయం తెలిసి జనం ఆ ఆలయానికి క్యూ కడుతున్నారు. ఆ ఆలయం ఎక్కడుందో..? అక్కడికి వెళితే షుగర్ ఎలా నయం అవుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
షుగర్, డయాబెటిస్ మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మాయదారి రోగంలా మారి ప్రజలను కమ్మేస్తుంది. ఇప్పటికే మన దేశంలో అత్యంత స్పీడుగా విస్తరిస్తున్న రోగాలలో షుగర్ ఒకటి. ఒక్కసారి షుగర్ వచ్చిందంటే చాలు ఇక జీవితాంతం మందులు వాడాల్సిందేనని డాక్టర్లు చెప్తుంటారు. అయితే ఎన్ని మందులు వాడినా.. చాలా మందికి షుగర్ కంట్రోల్ కాక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇక షుగర్ వచ్చాక దాని కంట్రోల్ కోసం వాడే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. మార్కెట్ లో షుగర్ పేరు చెప్పి కోట్ల రూపాయల దందా నడుస్తుంది. మా మెడిసిన్ వాడితే మీ షుగర్ మాయం అంటూ ఆయుర్వేదం నుంచి అల్లోపతి వరకు ఎన్నో రకాల చీటింగ్‌లు జరుగుతున్నాయి.. జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒక్క గుడికి వెళితే మీకున్న షుగర్ తగ్గిపోతుందట. అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి మీరు ప్రసాదం తీసుకుంటే మీ డయాబెటిస్ అడ్రస్ లేకుండా పోతుందంటున్నారు. ఇంతకీ ఆ గుడి కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశం ఆధ్యాత్మికతకు అద్బుతాలకు నెలవు.. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా ఉంటే మరికొన్ని అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేస్తుంటాయి. కొన్ని ఆలయాల నిర్మాణాలు విభిన్న రీతిలో ఉంటూ పలువురుని ఆకట్టుకుంటుంటాయి. అలాంటి కోవలోకి చెందినదే తమిళనాడులోని కోవెల్‌వెన్ని ఆలయం. ఈ ఆలయ ప్రత్యేక ఏంటంటే ఇక్కడి దేవుడిని దర్శించుకుంటే దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న డయాబెటిస్ ( sugar) తగ్గిపోతుందట.
అవును మీరు చదువుతున్నది నిజమే తమిళనాడులోని తిరువారూర్ జిల్లా అమ్మపేట గ్రామ సమీపంలో కొలువైన కోవిల్ వెన్ని ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా అక్కడి భక్తులు చెప్తుంటారు. ఈ ఆలయంలో పరమశివుడు లింగరూపంలో కరుంబేశ్వర స్వామిగా.. పార్వతి దేవి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇక్కడి స్వామి అమ్మవార్లు స్వయంభూగా వెళ్లిశారు. ఇక్కడి స్వామి అమ్మవార్లు ఎప్పుడు చెరుకు కట్టలతో కప్పబడి ఉంటారు. ఒకప్పుడు ఈ స్థలం చెరుకు, నందివర్దనం చెట్లతో కప్పబడి ఉండేదని అందుకే ఇక్కడి స్వామి వారికి వెన్ని కరుంభేశ్వర్ స్వామిగా పిలుస్తారు.
మధుమేహం ఎలా నయం అవుతుందంటే:
ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇందుకోసం ఈ గుడికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ నైవేద్యం పెట్టిన భక్తుల షుగర్ తగ్గిపోయిందని చెప్తున్నారు.
మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం ఇదేనని.. ఈ ఆలయంలో కొలువైన శివలింగం ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదని .. ఈ ఆలయాన్ని సాక్ష్యాత్తు శ్రీకృష్ణు భగవానుడే స్వయంగా నిర్మించారని ఆలయ చరిత్ర చెప్తుంది. అందుకే ఈ ఆలయానికి అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని భక్తులు నమ్ముతున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు