Terrorist Encounter: జమ్మూకశ్మీర్ థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చాకచక్యంగా మట్టుబెట్టాయి. నిర్మాణంలో ఉన్న భవనంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారని తెలుసుకున్న భద్రతా బలగాలు..ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. ముష్కరులను అంతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ.. టెక్నాలజీని ఉపయోగించుకుంది. డ్రోన్లతో టెర్రరిస్టులు నక్కిన ప్రాంతాన్ని ట్రేస్ చేశారు. ఎటు వైపు ఉన్నారు..ఎక్కడ దాక్కున్నారు. భవనంలోకి ఎలా వెళ్లాలి..ముష్కరులను ఎలా అంతమొందించాలన్న విషయాల్లో..సైనికులకు ..డ్రోన్ కీలకంగా ఉపయోగపడింది.
అయితే ఉగ్రవాదులు భారత్ ఆర్మీ సిబ్బందుల ఎన్‌కౌంటర్‌కి భయపడి ఉగ్రవాదులు నక్కి నక్కి.. చూస్తున్నారు. ఈ యుద్ధంలో వారు పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పుల్వామా జిల్లాలో థ్రాల్ ఏరియాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఒక ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు ఆర్మీ నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఉగ్రవాదులు విఫలం అయ్యారు. అక్కడ ఉగ్రవాదులను డ్రోన్ల సాయంతో కదలికను ఆర్మీ గుర్తించారు. అయితే మొత్తం 48 గంటల్లో ఆరుగురిని ఎన్‌కౌంటర్ చేసారు. ఎదురుకాల్పులు జరిపిన తర్వాత ఆర్మీ కాల్పులో ఉగ్రవాదులు హతమయ్యారని చెబుతున్నారు. చనిపోయిన ముగ్గురు జేశే మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించారు.
Also Read: మన జవాన్‌ను పాక్ ఎంత టార్చర్ చేసిందంటే.. షాకింగ్ నిజాలు..
జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని థ్రాల్‌లోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్టమైన సమాచారం ఉంది. భద్రతా సిబ్బందిని చూడగానే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఈ ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. అయితే భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ సమయంలో మన సైనికుల దాడిని ఎదుర్కోలేక..ఉగ్రవాదులు..ఓ నిర్మాణంలో దాక్కున్నారు. ఈ సమయంలో.. ఉగ్రవాదులను గుర్తించేందుకు భారత ఆర్మీ డ్రోన్‌ను రంగంలోకి దించింది. ఓ ట్యాబ్‌కు డ్రోన్‌ను కనెక్ట్ చేసి..ఉగ్రవాదుల జాడను కనిపెట్టింది భారత ఆర్మీ. అనంతరం టెర్రరిస్టులకు తెలియకుండానే..వారికి గన్స్ ఎయిమ్ చేసి..మట్టుబెట్టింది. అయితే ఈ భద్రత దళాలుకు ఆపరేషన్ కిల్లర్ అని పేరు పెట్టారు.