Viral Video: అదొక ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే బస్సు అది. రవాణా దేవుడెరుగు.. ఈ బస్సు కాసేపు యుద్ధానికి వేదికగా మారింది. ఆ యుద్ధం ఒకరు నచ్చజెబితే ఆగే యుద్ధం కాదు. మధ్యలో ఎవరైనా తల దూర్చారో వారికే చుట్టుకొనే సమరం. అలాంటి యుద్ధం జరిగింది ఎక్కడో కాదు తెలంగాణ ఆర్టీసీ బస్సులోనే. అసలు ఎంత నచ్చజెప్పినా వినకుండా, వెంట్రుకలు ఊడిపడేలా ఈ యుద్ధం సాగింది. ఎట్టకేలకు కొందరు ధైర్యంగా అడ్డుకొని సర్దిచెపితే కానీ ఈ యుద్ధం ఆగలేదు. ఇంతకు బస్సులో జరిగిన ఈ పోరాట దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే..
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఫ్రీ అని ప్రకటించడమే కాక, బస్సుల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచింది. కానీ ఓపిక, సహనం కోల్పోయిన కొందరు చేస్తున్న చేష్టలు ఆర్టీసీ ఉద్యోగులకు పెద్ద చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల ఛాన్స్ దొరికితే చాలు సీటు కోసం ఆర్టీసీ బస్సుల్లో పెద్ద యుద్ధమే సాగుతోంది. పాపం ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ డ్యూటీ చేసుకుంటారా? ఈ యుద్ధాలు ఆపుతారా.. వారు కూడా ఈ పోరాటాలను చూస్తూ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి.
ఇటీవల ఇలాంటి సీటు పోరాటాలు అధికం అయ్యాయని చెప్పవచ్చు. బస్సులు అధికంగా ఉన్నా, కాస్త ఓపిక, సహనం లేకనే ఇలాంటి పోరాటాలు ఆర్టీసీ బస్సుల్లో జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా కొందరు మహిళలు కోపాన్ని నియంత్రించుకోలేక తెగ పొట్టుపొట్టుగా పోట్లాడుకుంటున్నారు. ఆ వీడియోలు మాత్రం ఎవరో ఒకరు చిత్రీకరించడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే తంతుగా మారింది.
ఇప్పుడు ఏం జరిగిందంటే?
మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకొని బలంగా కొట్టుకున్నారు. బస్సుల్లో ప్రయాణం చేసే సమయంలో సీటు సమస్య చాలా సాధారణం. ప్రత్యేకంగా ప్రయాణ సమయాలు ఎక్కిపోతున్న సమయంలో, సీట్లు చాలా పరిమితంగా ఉంటాయి. ఈ కారణంగా ప్రయాణికులు మధ్య చిన్న చిన్న గొడవలు, అనవసరమైన ఘర్షణలు కూడా చోటు చేసుకోవడం అలవాటుగా మారింది.
Also Read: Sri Harsha: పెళ్లికి రండి.. స్వయంగా కలెక్టర్ పేరిట ఆహ్వానం.. అసలు విషయం తెలుసా?
అయితే, ఈసారి ఘర్షణ అంతే తీవ్రతతో కాదు, మహిళల మధ్య జుట్టు పట్టుకొని కొట్టుకోవడం వరకు పరిస్థితి చేరింది. మహిళలు బస్సులో సీటు కోసం మాటల వివాదం మొదలుపెట్టారు. నీ అంతు చూస్తా బిడ్డా వంటి మాటలతో మాటలు మరింత తీవ్రమయ్యాయి. ఇక కొద్ది క్షణాల్లో మిగిలిన ప్రయాణికులు ఎంటర్.. ఆ పోరాటం అంతా శాంతం. కోపంలో జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఎందుకు? కాస్త శాంతంగా ఉండవచ్చు కదా అంటూ మిగిలిన మహిళలు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.