E-Paper
Advertisement

August Grah Gochar: మరో రెండు రోజుల్లో గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి.. ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటే..

August Grah Gochar: మరో రెండు రోజుల్లో గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి.. ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటే..
Advertisement

August Grah Gochar: గ్రహాలు నిర్థిష్ట సమయంలో రాశులను ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంటాయి. ఈ తరుణంలో ఒక రాశి నుంచి మరో రాశికి ప్రయాణిస్తూ తీవ్ర ప్రభావాలను చూపిస్తుంటాయి. కొన్ని సార్లు రాశుల మార్పు శుభాలు కలిగితే, మరికొన్ని సార్లు అశుభ ప్రభావం చూపిస్తుంటాయి. మరో రెండు రోజుల్లో ఆగస్టు నెల ప్రారంభంకాబోతోంది. ఈ నెలలో 4 ముఖ్యమైన గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఈ రాశుల మార్పు అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే ఆగస్టు నెలలో ఉండబోయే గ్రహ సంచారాలు మరియు వాటి ప్రభావాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్ర క్యాలెండర్ ప్రకారం, మొదటగా ఆగష్టు 5వ తేదీన, బుధుడు సింహ రాశిలో తిరోగమనంలో ఉంటాడు. దీని తర్వాత ఆగస్టు 16వ తేదీన సూర్య భగవానుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 25వ తేదీన శుక్రుడు కన్యా రాశిలోకి, 26వ తేదీన బుధుబు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.

Advertisement

ఈ రాశులపై గ్రహ సంచారాల ప్రభావం..

వృషభ రాశి:

Advertisement

వృషభ రాశి వారికి ఇది మంచి సమయం కానుంది. ఈ కాలంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది.

సింహ రాశి:

సింహ రాశి వారికి ఆగష్టు గ్రహ సంచారం శుభ ఫలితాలను ఇవ్వనుంది. జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. చాలా సానుకూల మార్పులు వస్తాయి. సామాజిక జీవితంలో కీర్తి పెరుగుతుంది మరియు ఆర్థిక విషయాలలో అదృష్టం అనుకూలంగా ఉంటుంది. దీంతో కొత్త ఆదాయ మార్గాలను కూడా పొందవచ్చు.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపార రంగంలో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు మరియు కార్యాలయంలో మంచి పని తీరును కనబరుస్తారు. సమాజంలో గౌరవం పొందుతారు. దీనితో ఆర్థిక పరిస్థితిలో కూడా సానుకూల మార్పు ఉంటుంది. పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.

మకర రాశి:

మకర రాశి వారికి ఆగస్టు నెలలో ఆర్థికంగా విశేష ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వీకుల సంపద పరంగా లాభాలను పొందుతారు. ఇది కాకుండా, కొత్త ఆదాయ వనరులను కూడా పొందవచ్చు. జీవితంలో కొత్త మార్పులు రావచ్చు. వ్యాపార రంగంలో కూడా పురోగతి కనిపిస్తోంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×