BigTV English

Ashtadasa Shaktipeetha :అమ్మవారి విగ్రహం లేని అష్టాదశ శక్తిపీఠం

Ashtadasa Shaktipeetha :అమ్మవారి విగ్రహం లేని అష్టాదశ శక్తిపీఠం
Ashtadasa Shaktipeetha

Ashtadasa Shaktipeetha : అష్టాదశ పీఠాల్లో 14వ శక్తి పీఠం శ్రీ మాధవేశ్వరీ దేవీ. అలహాలాబాద్ లోని త్రివేణీ సంగమం దగ్గర వెలిసింది మధవేశ్వరీ దేవి అలహాబాద్ లోని ప్రయాగ స్థానంలో మాధవేశ్వరీ గుడి కూడా శక్తివంతమైన 18 శక్తి పీఠాల్లో ఒకటి.


పూర్వం… దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు.
ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు. అటు.. ఆహ్వానం అందకపోయినప్పటికీ పార్వదీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యాజ్ఞానికి వెళ్లగా.. అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించరు. అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన పార్వతీ.. అప్పటికప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలిస్తుంది. అది తెలిసిన శివుడు.. సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు.

అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించడం మొదలుపెడతాడు. లోక రక్షణకోసం శివుణ్ణి యధాస్ధితికి తీసుకురావటానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవి. కానీ.. కాలాంతరంలో 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి. వాటినే అష్టాదశ పీఠాలు అంటారు. అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు కానీ.. ఒక నలు చదరం పీఠంలాగా కనిపిస్తుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి నట్లుంటుంది. దానికింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచి మొక్కుకోవాలి.


Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×