Saraswati: సీనియర్ నటుడు శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులు పరిచయం. ఆయన కుమార్తెగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి. వరలక్ష్మి శరత్ కుమార్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది. తెలుగు ను మించి తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేసింది.
విభిన్నమైన పాత్రలను పోషించి తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఇష్టమైన నటిగా మారిపోయింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన క్రాక్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుఆ క్రాక్ సినిమాలోని జయమ్మ పాత్రలో వరలక్ష్మి నటించిన తీరు నెక్స్ట్ లెవెల్. విలన్ గా కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చింది. అలానే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీర సింహారెడ్డి సినిమాల్లో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఇప్పుడు వరలక్ష్మి తనలోని దర్శకత్వ ప్రతిభను బయటకు తీయబోతున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో సరస్వతి అనే ఒక సినిమా రానుంది. ఈ సినిమా కూడా భారీతారాగణంతో చేస్తుంది. అద్భుతమైన టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. సినిమాకి దర్శకత్వం చేయడం మాత్రమే కాకుండా వరలక్ష్మి ఈ సినిమాలో నటిస్తుంది. ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్ ప్రియమణి మరియు నవీన్ చంద్ర కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నాడు. సంగీత దర్శకుడుగా రీసెంట్ టైమ్స్ లో తమన్ విపరీతమైన పేరు సాధించుకున్నాడు.
చాలామందికి దర్శకులుగా ప్రూవ్ చేసుకోవాలి అనే ఆలోచన కచ్చితంగా ఉంటుంది. నటులుగా చేస్తున్నప్పుడు కూడా ఒక దర్శకుడు సినిమాని ఎలా డీల్ చేస్తున్నాడు అని పరిశీలిస్తుంటారు. ఒక్కొక్క దర్శకుడు ఒక్కో విధంగా డైరెక్షన్ చేస్తారు. నటులకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే చాలామంది దర్శకుల దర్శకత్వంలో నటిస్తారు. బహుశా ఎక్కువ సినిమాలు చేయడం వలన తాను కూడా అనుకున్న కథను తనే దర్శకత్వం చేయాలి అనే నిర్ణయం తీసుకుని ఉంటుంది వరలక్ష్మి.
#SARASWATHI 🎬
The first page of #DosaDiaries ❤️🔥A heartfelt congratulations to our talented debut director @varusarath5, we can’t wait to see the magic you create unfold on screen💫
The journey of Dosa Diaries begins today, and the pages ahead are sure to shine brighter than… pic.twitter.com/CsZYOnTCK9
— Dosa Diaries (@DosaDiariesOffl) September 27, 2025
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్రంలో తేజ సోదరిగా నటించి మంచి మార్కులను పొందుకొంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరలక్ష్మి ఇచ్చిన అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఈ సినిమాకి మరికొంత ప్లస్ అయింది. ఈ సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకుంది.
Also Read: K – Ramp : బూతులు గురించి క్లారిటీ, లేడీ రిపోర్టర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీనియర్ నరేష్