Bigg Boss Telugu 9 Weekend Episode: మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో సంజనను హౌజ్ నుంచి బయటకు పంపించారు. కానీ, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇప్పుడు హౌజ్ లోని కంటెస్టెంట్స్ కి అగ్ని పరీక్ష గా మారింది. ఈ వీకెండ్ అంటేనే ఆటపాట. కానీ, ఈ వీక్ వచ్చిరాగానే కంటెస్టెంట్స్ కి బాంబ్ పేల్చాడు. సంజన మిడ్ వీక్ ఎలిమినేట్ అంటూ సంజనను స్టేజ్ పైకి తీసుకువచ్చాడు. ఇప్పటి వరకు ఆమెను సీక్రెట్ రూంలో పెట్టి కంటెస్టెంట్స్ ఆమెకు గురించి ఏమనుకుంటున్నారో తెలిసేలా చేశాడు బిగ్ బాస్. ఇక స్టేజ్ పైకి వచ్చిన సంజన తన గురించి నెగిటివ్ గా మాట్లాడిన వారిని ఉతికారేసింది. ఏం బిడ్డా.. నిన్ను ఎప్పుడు చిన్నగా చూశాను రా.. చిన్నపిల్లాడిలా ట్రీట్ చేశాను.. ఒకరిని ఎక్కువగా.. ఒకరిని తక్కువగా చూస్తున్నావు అన్నావ్. ఎక్కడా మాట్లాడాను రా అంటూ రాముపై ఫైర్ అయ్యింది.
ఆ తర్వాత మాస్క్ మ్యాన్ బండారం బట్టబయలు చేసింది. నాలుగైదు రోజులుగా స్నానం చేయకుండా.. అలాగే వంట చేయడం అలా చేస్తున్నాడు. అది హౌజ్ లో అందరికి ఇబ్బందిగా ఉంది. అదే స్వెట్ షర్ట్ వేసుకుని చెమట వాసన.. నీట్ గా ఉండడు అని చెప్పి పరువు తీసింది. అలా హౌజ్ ఒక్కొక్కరి ఆట తీరుపై మాట్లాడుతూ వాళ్లకి సలహాలు సూచనలు ఇచ్చింది. ఇక అందరికి గుడ్ బై వెళ్లిపో అనడంతో.. ఆమె స్టేజ్ వీడింది. గేట్ వరకు వెళ్లిన సంజనను మళ్లీ వెనక్కి పిలిచాడు నాగ్. సంజన మళ్లీ హౌజ్ లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో అంత ఆనందంతో చప్పట్లు కొట్టాడు. కానీ,ఆమె హౌజ్ లోకి రావాలంటే సంజన బ్యాటరీ 100 శాతం పెరగాలి. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావాలంటే హౌజ్ లోని నలుగురు కొన్ని త్యాగం చేయాలని చెబుతాడు. చీటీలు వేసి ర్యాండమ్ గా వచ్చిన పేర్లు.. సంజన కోసం తమకు ఇష్టమైవి త్యాగం చేయాల్సి ఉంటుందని చెబుతున్నాడు. అలా ఫస్ట్ చిట్టి తీయగా.. ఇమ్మాన్యుయేల్ పేరు వస్తుంది.
తను ఎంతో కష్టపడి సంపాదించుకున్న కెప్టెన్సీని వదులుకోవాలని కండిషన్ పెడుతున్నాడు. అలా చెప్పగానే మరో ఆలోచన లేకుండ ఇమ్మూ కెప్టెన్సీ వదులుకున్నాడు. అది చూసి సంజన ఫుల్ ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత శ్రీజ దుమ్ముని.. బట్టలు సాక్రిఫై చేయాలంటాడు. తను హౌజ్ లో ఉన్నంత వరకు ఒకటే డ్రెస్ పై ఉండాలని కండిషన్ పెడతాడు. దీనికి ఆమె నిరాకరిస్తుంది. తర్వాత తనూజ పేరు వస్తుంది. సంజన మళ్లీ ఇంట్లోకి రావాలంటే ఆమె కాఫీ త్యాగం చేయాలంటాడు. హౌజ్ లో ఉన్నంత కాలం ఒక్క సిప్ కాఫీ కూడా తాగోద్దు. దీనికి తనూజ ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రీతూని హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పగా.. ఆమె హెయిర్ కట్ చేసుకుంది. అలా ముగ్గురి త్యాగంతో సంజన బ్యాటరీ.. 75 శాతానికి వస్తుంది.
ఫుల్ ఛార్జ్ కోసం సుమన్ శెట్టిని స్మోక్ చేయొద్దని అడగ్గా.. ఒప్పుకోలేదు. ఆ తర్వాత భరణి.. తను ఎంతో ఇష్టం చూసుకునే పెండేంట్ బాక్స్ ని వెనక్కి ఇవ్వాలని చెప్పడంతో వెంటనే ఒకే చెబుతాడు. ఇలా సంజన కోసం హౌజ్లో నలుగురు తమకు ఎంతో ఇష్టమైన వస్తువుల త్యాగం చేయడంతో ఆమె మిడ్ వీక్ ఎలిమినేషన్ రద్దయ్యింది. ఇక ఆమె తిరిగి ఇంట్లోకి అడుగుపెట్టింది. సంజన తిరిగి ఇంట్లోకి వస్తుండటంతో మాస్క్ మ్యాన్ డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ సటైర్స్ వేస్తాడు. సుమన్ శెట్టి, హరీష్ కూర్చోని మాట్లాడుకుంటారు. హౌజ్ అందరు మాస్క్ తో ఆడుతున్నారు. ఎంతకాలం వాళ్ల రియాలిటీ బయటపడకుండ ఆడుతారో చూస్తా. అందరు దొంగ ప్రేమలు నటిస్తున్నారు. అంటూ హౌజ్ మేట్స్ పై అసహనం చూపిస్తాడు. ఇక నుంచి తాను వంటన చేయనని స్ట్రాంగ్ డెసిజన్ తీసుకున్నాడు. నేషనల్ టెలివిజన్ లో నా గురించి అలా అంటుందా? మాస్క్ మ్యాన సంజనపై ఆగ్రహం చూపించాడు.