BigTV English

Bigg Boss 9 : ఇది అసలైన రణరంగం,సుమన్ శెట్టి మీద ఒపీనియన్ పోతుంది

Bigg Boss 9 : ఇది అసలైన రణరంగం,సుమన్ శెట్టి మీద ఒపీనియన్ పోతుంది

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 మొదలైనప్పుడు నుంచి ఇది చదరంగం కాదు రణరంగం అంటూ చెబుతూనే ఉన్నారు. అయితే ఇదేదో ప్రాస కోసం చెప్పారో అనుకున్నాం. కానీ ఈరోజు ఇచ్చిన ట్విస్టులు చూస్తుంటే నిజంగా రణరంగమే అనే ఫీలింగ్ కలుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో సంజన ఎలిమినేట్ అయిపోయింది అని అందరూ ఊహించరు.


కానీ సంజన ఎలిమినేట్ కాలేదు. సీక్రెట్ రూమ్ లో కూర్చుని మనుషులు అసలైన రూపాలను అబ్జర్వ్ చేసింది. దీనిని చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు బిగ్ బాస్. అయితే సంజన వెళ్లిపోయినట్లుగానే చూపించి స్టేజ్ మీద మాట్లాడించారు.

అన్నీ బయట పెట్టేసింది

సంజన హౌస్ మేట్స్ అందరి గురించి కూడా తన ఒపీనియన్ చెప్పింది. ముఖ్యంగా రాముకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అలానే హరీష్ గురించి ఫుడ్ విషయంలో కంప్లైంట్ చేసింది. ఇమ్మానుయేల్ గురించి ఎమోషనల్ అయిపోతూ మాట్లాడింది. శ్రీజ అరవడంలో వెయ్యి శాతం నుంచి 300% వరకు తగ్గింది అంటూ మాట్లాడింది. ఇలా హౌస్ మేట్స్ అందరి గురించి కూడా ఉన్న విషయాలను చెప్పేసింది. అన్నీ చెప్పి వెళ్ళిపోతున్న వెళ్ళిపోతున్న తరుణంలో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. మళ్లీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కొన్ని సాగ్రిఫైజెస్ తో డిజైన్ చేశారు.


సాగ్రిఫైజెస్

హౌస్ లోకి సంజన ఎంట్రీ ఇవ్వాలి అంటే, హౌస్ మేట్స్ కొంత సాగ్రిఫైజ్ చేయాలి. ఇమ్మానుయేల్ ను కెప్టెన్సీ వదిలేయాలి అని అడగ్గానే చేశాడు. తనుజను కాఫీ వదిలేయమని చెప్పారు. తాను కూడా దానికి ఓకే చెప్పింది. రీతు చౌదరిని హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్పారు. రీతు చౌదరి దానికి కూడా ఒప్పుకుంది. కానీ హెయిర్ వదులుకోవాలి అంటే మామూలు విషయం కాదు. అందుకే షార్ట్ హెయిర్ తో ఉండడానికి ఒప్పుకొని కన్నీళ్లు పెట్టుకుంది.

 

శ్రీజను బట్టలు సాగ్రిఫైజ్ చేయమని చెప్పారు. తను నో అని చెప్పింది. సుమన్ శెట్టిను సిగరెట్లు వదిలేయమని చెబితే తాను నా వలన కాదు అన్నాడు. గతంలో కూడా సిగరెట్లు మానేయమని సుమన్ శెట్టి కి స్వయంగా సంజన చెప్పింది. అయితే భరణిని గోల్డెన్ బాక్స్ వదిలేయమని చెప్పగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా గోల్డెన్ బాక్స్ వదిలేసి బాధపడ్డాడు. భరణి ఇలా చేయడంతో అందరికీ ఒక పాజిటివ్ ఒపీనియన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సిగరెట్ల విషయంలో సుమన్ శెట్టి అలా అనడం కరెక్ట్ కాదేమో అని చాలామంది ప్రేక్షకులకు అనిపించే అవకాశం ఉంది. కొంతమేరకు ఆయనపై ఉన్న అభిప్రాయం తగ్గొచ్చు.

Also Read : Saraswati : డైరెక్టర్ గా మారిన ప్రముఖ నటి, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు

Related News

Bigg Boss 9 : ఫ్యూజ్ లు ఎగిరిపోయే వార్నింగ్ లు, సరికొత్త టాస్కులు, మరికొన్ని ట్విస్టులు 

Bigg Boss 9: కంటెస్టెంట్స్ కి రియల్ అగ్ని పరీక్ష.. సంజన కోసం ఇమ్మూ కెప్టెన్సీ, రీతూ జుట్టు.. తనూజ కాఫీ.. త్యాగం

Bigg Boss 9: కొత్త కెప్టెన్ గా డిమాన్ పవన్, ఒక మెట్టు ఎక్కేసావయ్యా ఇమ్మానియేల్

Bigg Boss 9 Promo: అంత చీప్‌గా కనిపిస్తున్నానా.. ఇలాంటి మనిషితో ఉండలేం.. హరీష్‌, రాముని కడిగిపారేసిన సంజన!

Bigg Boss 9 Telugu: డబుల్‌ ఎలిమినేషన్‌ కాదు.. సింగిలే, మూడో వారం కామనర్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo: లత్కోర్ హరీష్.. ఇచ్చి పడేసిన నాగ్.. ఇకనైనా మారండ్రా బాబు!

Bigg Boss 9: సంజన బయటికి వెళ్లిపోయిందా? గుక్క పెట్టిన ఇమ్మానియేల్, బిగ్ బాస్ మెంటల్ మాస్ ప్లాన్

Big Stories

×