BigTV English

OTT Movie: పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

OTT Movie: పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

OTT Movie : ఓటీటీలోకి వెబ్ సిరీస్ లు కొత్త కంటెంట్ తో వస్తున్నాయి. ఆడియన్స్ మెప్పు పొందేందుకు మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ శైలిలో, ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసే థ్రిల్లర్ స్టోరీలతో కేక పెట్టిస్తున్నారు. వీటిలో సీరియల్ కిల్లర్ కథలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ప్రతి ఎపిసోడ్ మెంటలెక్కించే ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘గ్రోటెస్కరీ’ 2024 లో వచ్చిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్. దీనిని ర్యాన్ మర్ఫీ, జాన్ రాబిన్ బైట్జ్, జో బేకెన్ సృష్టించారు. ఈ సిరీస్‌లో నీసీ నాష్-బెట్స్, కోర్ట్నీ బి. వాన్స్, నికోలస్ అలెగ్జాండర్ చావెజ్, మైకేలా డైమండ్, రావెన్ గుడ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2024 సెప్టెంబర్ 25 నుంచి హులు, డిస్నీ+లో స్ట్రీమింగ్ అవుతోంది. 10 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ సిరీస్, IMDbలో 6.5/10 రేటింగ్ సాధించింది.

స్టోరీలోకి వెళ్తే

ఈ కథ ఒక చిన్న అమెరికన్ పట్టణంలో జరిగే మహిళల దారుణమైన హత్యల చుట్టూ నడిచే ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. డిటెక్టివ్ లోయిస్ ఈ సీరియల్ కిల్లింగ్ కేసును ఛేదించడానికి నియమించబడుతుంది. ఈ హత్యలు బైబిల్ నుంచి ఇన్స్పైర్ అయినట్లుగా, అత్యంత భయంకరంగా ఉంటాయి. కిల్లర్ ‘గ్రోటెస్కరీ’ అనే సంతకంతో హత్యలు చేస్తుంటాడు. లోయిస్‌కు ఈ నేరాలు తన వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్నట్లు అనిపిస్తాయి. ఎందుకంటే కిల్లర్ ఆమెను ఎగతాళి చేస్తున్నట్లు తను భావిస్తుంది. ఇప్పుడు లోయిస్ జీవితం కూడా గందరగోళంలో ఉంటుంది. ఆమె కుమార్తె మెరిట్ తో సంబంధం అంత సవ్యంగా ఉండదు. మరోవైపు ఆమె భర్త మార్షల్ దీర్ఘకాలంగా ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆమె మద్యానికి బానిసవుతుంది.


ఇన్ని సమస్యల మధ్య ఆమె ఈ హత్యల సీక్రెట్ కనుగొనేందుకు ప్రయత్నిస్తుంది. క్లూస్ అంతగా లేకపోవడంతో ఆమె మేగన్ అనే నన్ సహాయం తీసుకుంటుంది. వీళ్లిద్దరూ కలిసి ఈ నేరాలను ఛేదించడానికి ప్రయత్నిస్తూ, ఊహించని సమస్యల్లో చిక్కుకుంటారు. అయితే లోయిస్ కోమాలో ఉన్న తన భర్తకి వస్తున్న కలలను చూడగలుగుతుంది. ఇవి ఆమె దర్యాప్తులో కీలకంగా మారుతాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ హత్యల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? ఈ హత్యలు లోయిస్ జీవితంతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయి ? ఈ హత్యలను ఆపడానికి ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ? కిల్లర్ మహిళలను ఎందుకు చంపుతున్నాడు. అనే ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలను మాత్రం ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్

Related News

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

OTT Movie : పోలీస్ మర్డర్ కేసులో ఊహించని ట్విస్టులు … ఎటూ తేలని యవ్వారం …ఈ కిల్లర్ మామూలోడు కాదు

OTT Movie : కిరాక్ క్రైమ్ థ్రిల్లర్ … సోదరి మీదే రివేంజ్ … ఈ లవ్ స్టోరీ కూడా తేడానే

Upcoming OTT Movies in October: ‘లిటిల్ హార్ట్స్’ నుంచి ‘ఓజీ’ దాకా ఓటీటీలో అక్టోబర్ సినిమాల జాతర… ఈ క్రేజీ సినిమాల్ని అస్సలు మిస్ అవ్వొద్దు

Little Hearts OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్…ఇక నాన్ స్టాప్ నవ్వులే!

Tollywood: ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ మూవీ!

OTT Movie : వరుస మర్డర్స్ తో పోలీసులకు చెమటలు పట్టించే కిల్లర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×