Anasuya: అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అనసూయ ప్రస్తుతం సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఈమెకు వరుస పాన్ ఇండియా సినిమాలలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో బుల్లితెరకు గుడ్ బై చెబుతూ వెండి తెర సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. తాజాగా అనసూయ తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఇలా ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలు షేర్ చేయటమే ఆలస్యం ఈమె బికినీ ఫోటోలతో సోషల్ మీడియా షేక్ అవుతోందని చెప్పాలి. బికినీలో చిన్న పిల్లలా స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అలాగే ఈ స్విమ్ సూట్ లో ఈమె హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. చేతులు పైకెత్తి తన అందాలన్నింటినీ ఆరబోస్తూ కిస్సిక్ అంటూ ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఇలా అనసూయ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తూ కుర్రకారుల చూపు పక్కకు తిప్పుకోనివ్వట్లేదు. ఇక ఈ ఫోటోలపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలపై ఎన్నో రకాల విమర్శలు కూడా వస్తుంటాయి
అయితే ఈ విమర్శలకు అనసూయ తనదైన శైలిలోనే సమాధానం చెబుతూ ఉంటారు. గతంలో ఈమె వస్త్రధారణ గురించి ఎన్ని విమర్శలు వచ్చినా తన బట్టలు తన ఇష్టమని, తనకు నచ్చినట్టుగానే తాను ఉంటానని నిర్మొహమాటంగా సమాధానం ఇచ్చారు.
ఇలా తనపై ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ మాత్రం తనకు నచ్చిన పనులను చేస్తూ తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగానే గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఏది ఏమైనా నాలుగు పదుల వయసులో కూడా అనసూయ ఈ రేంజ్ లో అందచందాలను ఆరబోయడంతో కుర్రకారులకు కంటిమీద కునుకు లేదని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి. ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న ఈమెకు రంగస్థలం సినిమా అద్భుతమైన విజయాన్ని అందించిందని చెప్పాలి. ఈ సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించిన సందడి చేశారు. ఈ సినిమా అనంతరం అనసూయకు పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్న నేపథ్యంలో వెండితెరపై బిజీగా గడుపుతున్నారు. ఇక బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమం అనసూయకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
Also Read: Big tv Kissik Talks: సినిమాలో ఛాన్సులు.. సోషల్ మీడియా ట్రోల్స్ పై ఫైర్ అయిన భాను!