IND Vs PAK : ఆసియా కప్ 2025 లో భాగంగా సెప్టెంబర్ 28న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ పై రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే ఫైనల్ కి బీసీసీఐ అధికారి ఎవ్వరూ కూడా మైదానంలో ఉండరు అని సమాచారం. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే పహల్గామ్ బాధితులు పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని.. మనం మ్యాచ్ ఆడటం వల్ల పాకిస్తాన్ కి లాభం చేకూరుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లీగ్ దశలో మ్యాచ్ కి ముందు అభిమానులు సైతం పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయించుకున్నారు. మరోసారి కనుక టీమిండియా విజయం సాధించకుంటే.. దగ్గర ఉండి మరీ టీమిండియా పాకిస్తాన్ గెలిపించిందనే కామెంట్స్ కూడా అభిమానుల నుంచి వినిపించనున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో జరిగే ప్రతి మ్యాచ్ కి టీమిండియా ఆటగాళ్లు..పాకిస్తాన్ ఆటగాళ్లకు ఎవ్వరికీ ” షేక్ హ్యాండ్” ఇవ్వడం లేదు. దీనిపై పాకిస్తాన్ ఆటగాళ్లు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకుంటున్నట్టు సమాచారం. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ వరకు హార్దిక్ అందుబాటులోకి రానున్నాడు. టీమిండియా లీగ్ దశలో, సూపర్ 4 దశలో గెలిచిందని.. కానీ ఫైనల్ లో గెలవదని పలువురు పాకిస్తాన్ అభిమానులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ అధికారి ఎవ్వరూ కూడా మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
సెప్టెంబర్ 28న పాకిస్తాన్ పై మ్యాచ్ గెలిస్తే.. రికార్డు సృష్టిస్తుంది. పాకిస్తాన్ మాజీ ఆటగాళ్ల ప్రకటనలు ఎంత వరకు ప్రభావం చూపుతాయో తెలియదు కానీ ఇండియా-పాక్ ఫైనల్ మ్యాచ్ మాత్రం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని అయితే పెంచుతోంది. మరోవైపు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ల కోసం భారత్ పీవీఆర్ సినిమా థియేటర్లలో 100 స్క్రీన్ల వరకు మ్యాచ్ ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. భారత్ తన అన్ని మ్యాచ్‌లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకోగా, పాకిస్తాన్ జట్టు కూడా భారత్‌తో ఓటమి తర్వాత ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడినప్పుడు, 2025 ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇది మూడవ మ్యాచ్ అవుతుంది. మొత్తానికి టీమిండియా-పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు జట్లలో ఎవ్వరూ పై చేయి సాధిస్తారనేది మరో 24 గంటల్లోనే తేలనుంది.