BigTV English

Lord Mercury: బుధుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి శుభదినాలు ప్రారంభం

Lord Mercury: బుధుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి శుభదినాలు ప్రారంభం

Lord Mercury: బుధుడు తన రాశిని మార్చుకున్నాడు. జూన్ 29న గ్రహాల రాకుమారుడు బుధుడు రాశి మారాడు. కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలసివస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం అత్యంత వేగంగా బుధుడు రాశి మార్చుకుంటాడు. బుధుడు జూన్ 29 న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి శుభాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది.


బుధుడు, మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, తెలివి గణితం, స్నేహానికి బాధ్యత వహిస్తాడు. అందుకే బుధుడిని గ్రహాల రాకుమారుడు అని కూడా పిలుస్తారు. బుధుడు శాంతంగా ఉన్నప్పుడు ఆయా రాశులకు శుభ ఫలితాలను కలిగిస్తాడు. కర్కాటక రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:


ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తల్లి నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంపత్య జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మిథున రాశి:
బుధుడి అనుగ్రహంతో శక్తి, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ పిల్లలు సంతోషంగా ఉంటారు. ఉన్నత విద్యా పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఆఫీసు మారడానికి అవకాశం ఉంది. ఇష్టమైన ప్రదేశానికి బదిలీ జరిగే అవకాశాలున్నాయి. మనసులో శాంతి, సంతోష భావాలు కలుగుతాయి. తల్లి లేదా కుటుంబంలోని వృద్ధుల నుంచి డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మీరు చేసే పనుల్లో అధికారుల మద్దతు లభిస్తుంది.

సింహ రాశి:
సింహ రాశి వారికి బుధుడి సంచారం ఆనందాన్ని పెంచుతుంది. మీరు తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు. బట్టలు మొదలైన వాటి పట్ల ఆసక్తి చాలా పెరుగుతుంది. చదువుపై ఆసక్తి కనబరుస్తారు. పిల్లల సంతోషం కూడా పెరుగుతుంది. ఉద్యోగ పురోగతికి అవకాశాలు ఎంతగానో ఉన్నా యి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. తీర్థ యాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: గజకేసరి యోగంతో 5 రాశుల వారికి బంగారు అవకాశాలు

ధనస్సు రాశి:
బుధుడి సంచారం వల్ల ఆస్తి ద్వారా వీరికి ఆదాయం పెరుగుతుంది. మీ తల్లి నుంచి డబ్బు పొందుతారు. సంగీతం పట్ల ఆసక్తి చాలా వరకు పెరుగుతుంది. పనిప్రదేశంలో చాలా శ్రమ ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలను పొందుతారు. ఉద్యోగ పురోగతి కూడా అవకాశాలున్నాయి. మీకు పై అధికారులు అండగా నిలుస్తారు. కొత్త వాహనాలు కొరుగోలె చేస్తారు.

Related News

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Big Stories

×