RamCharan 18Yrs Legacy : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోస్ లో రామ్ చరణ్ ఒకరు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. చిరంజీవి కొడుకుగా ఇండస్ట్రీలో ఉండటం అనేది మామూలు విషయం కాదు. చిరంజీవి అనే బాధ్యతను మోయాలి అంటే చాలా ఒత్తిడి ఉంటుంది. వీటన్నిటి మధ్యలో కూడా మంచి సినిమాలు చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్.
రామ్ చరణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 18 సంవత్సరాలు అయిపోతుంది. తను నటించిన చిరుత సినిమా సెప్టెంబర్ 28న విడుదలైంది. రామ్ చరణ్ 18 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక కామన్ డిపి ను విడుదల చేశారు. అయితే ఈ 18 సంవత్సరాల జర్నీలో రామ్ చరణ్ చేసిన ముఖ్యమైన పాత్రలు, హై వచ్చే సీన్స్ ఒక్కో సినిమా నుంచి పిక్ చేసి ఈ కామన్ పిక్చర్ ను చేశారు. జస్ట్ ఈ పిక్చర్ చూస్తుంటే రామ్ చరణ్ నటించిన అద్భుతమైన పాత్రలు కళ్ళ ముందు కదులుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అని పూరి జగన్నాథ్ ఎప్పటినుంచో కలలు కన్నాడు. ఆ కల ఇప్పటికే నిజం కాలేదు. కానీ చిరంజీవి కొడుకు కోసం కథ చెప్తే మాత్రం మెగాస్టార్ కి నచ్చింది. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చిరుత టైటిల్ లోనే చిరు తనయుడు అని వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్. ఎంతోమంది క్యూరియాసిటీకి ఈ సినిమా సమాధానం చెప్పింది. పర్వాలేదు మెగాస్టార్ కొడుకు ఇండస్ట్రీని ఏలుతాడు అనే నమ్మకాన్ని ఇచ్చింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సినిమాల ప్రస్తావని వస్తే అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అవి క్రియేట్ చేసిన సంచలనాలు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. రెండవ సినిమా మగధీర తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్నాడు చరణ్.
మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత ఆరెంజ్ అనే సినిమా చేశాడు. రాంచరణ్ కెరియర్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ లవ్ స్టోరీ అది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేదు. జంజీర్, తుఫాన్, రచ్చ, నాయక్, గోవిందుడు అందరివాడే సినిమాలు ఊహించిన సక్సెస్ సాధించలేదు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధ్రువ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. చరణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా రంగస్థలం సినిమాకు ఉన్న క్రేజ్ వేరు. రామ్ చరణ్ లోని పరిపూర్ణమైన నటుడును బయటికి తీసిన సినిమా రంగస్థలం. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్నాడు చరణ్. ఇక పెద్ది సినిమాతో మరింత సక్సెస్ అందుకొని ఇంకా కెరియర్లో ముందుకు వెళ్లి మరిన్ని గొప్ప సినిమాలు చేస్తారని ఆశిద్దాం.
Also Read: STR49 : మోస్ట్ అవైటెడ్ కాంబో సెట్, శింబు కొత్త లుక్ అదిరింది