IND Vs SL : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ సూపర్ 4 లో చివరి మ్యాచ్ శ్రీలంక వర్సెస్ టీమిండియా మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే శ్రీలంక సూపర్ 4లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లతో ఓటమి పాలవ్వడంతో టీమిండియాతో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. టీమిండియా కి ఇది కేవలం నామమాత్రపు మ్యాచ్. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో ఆడి విజయం సాధించింది టీమిండియా. సూపర్ 4లో కనీసం ఒక్క విజయంతోనైనా ముగించాలని భావిస్తున్న శ్రీలంక జట్టు.. టీమిండియా పై విజయం సాధిస్తుందో లేదో చూడాలి.
Also Read : IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో
శ్రీలంక జట్టు లీగ్ దశలో టాప్ జట్టుగా నిలిచింది. కానీ సూపర్ 4 కి వచ్చే తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో, రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుతో ఓటమి పాలైంది. దీంతో శ్రీలంక జట్టుకు ఫైనల్ చేరే అవకాశాలు లేకుండా పోయాయి. ఇవాళ నామమాత్రపు మ్యాచ్ లో భారత్ తో తలపడి తన ఖాతాలో విజయం వేసుకోవాలని భావిస్తోంది. కానీ టీమిండియాలో అభిషేక్ శర్మ, శుబ్ మన్ గిల్, సంజుశాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి బ్యాటర్లు మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. మంచి ఫామ్ లో ఉన్న టీమిండియా జట్టును ఢీ కొనాలంటే శ్రీలంక కి కష్టంతో కూడుకున్న పనే అని చెప్పవచ్చు.
మరోవైపు శ్రీలంక జట్టు కూడా బలంగానే ఉంది. కానీ వాళ్లు ఎప్పుడూ ఫామ్ లో ఉంటారు. మరెప్పుడు ఫామ్ లో ఉండరో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో శ్రీలంక జట్టు విజయాన్ని అంచెనా వేయడం కూడా కొంచెం కష్టం అనే చెప్పవచ్చు. డూ ఆర్ డై మ్యాచ్ కి ముందు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. ప్రధాన పేసర్ పతిరణ ఈ మ్యాచ్ కి కూడా దూరం అయ్యాడు. పతిరణ గాయం కారణంగా శ్రీలంక ఆడిన గత 3 మ్యాచ్ లకు కూడా దూరం ఉన్నాడు. అతను కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్ కి అందుబాటులోకి వస్తాడని శ్రీలంక మేనేజ్ మెంట్ భావించింది.
కానీ రాలేదు. టీమిండియాతో జరిగే మ్యాచ్ కి అయినా అందుబాటులోకి వస్తాడనుకుంటే ఈ మ్యాచ్ కి కూడా అందుబాటులోకి రాలేదు.
భారత జట్టు :
కెప్టెన్ సూర్యకుమార్, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్.
శ్రీలంక జట్టు :
పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కుసల్ పెరీరా, చరిత్ అసలంక(సి), కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, జనిత్ లియానాగే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, నువాన్ తుషార.