Raipur Crime: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని నగరం రాయ్ పూర్ లో స్టీల్ ప్లాంట్ లో నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరో ఐదుగురు కార్మికులు చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: BRS KTR: నన్ను ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి.. నేను దేనికైనా రెడీ: కేటీఆర్