E-Paper
Advertisement

Kamal Haasan: రోబో, 2.o సినిమాల్లో అందుకే నటించలేదు: కమల్ హాసన్

Kamal Haasan: రోబో, 2.o సినిమాల్లో అందుకే నటించలేదు: కమల్ హాసన్
Advertisement

Kamal Haasan: విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ఇండియన్2’. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే నెల అంటే జూలై 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కమల్ హాసన్ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి.

ముఖ్యంగా ట్రైలర్‌లో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించిన కమల్.. తమ అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించాడు. కాగా ఇందులో ప్రధాన తారగణం కీలక పాత్ర పోషిస్తుంది. నటుడు సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ సహా మరి కొంతమంది నటీ నటులు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు.

Advertisement

ఈ మేరకు కమల్ హాసన్ పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ గత సినిమాల గురించి.. అలాగే ప్రస్తుత సినిమాల గురించి అనేక విషయాలు చెప్పుకొస్తున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోబో, 2.ఓ సినిమాల్లో తానెందుకు నటించలేదో తెలిపాడు. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన సినిమాల్లో ‘2.ఓ’ మూవీ ఒకటి. ఈ మూవీలో ముందుగా విలన్ పాత్ర కోసం దర్శకుడు శంకర్.. కమల్ హాసన్‌ను అనుకున్నారట.

Also Read: దర్శకుడు శంకర్ ప్లాన్ అదుర్స్.. ‘ఇండియన్ 2’ కోసం తరలి వస్తున్న సౌత్ స్టార్ హీరోలు?

Advertisement

కానీ ఆ మూవీలో విలన్ పాత్రలో నటించేందుకు కమల్ తిరస్కరించినట్లు తెలిపాడు. ఇంకా కొన్నాళ్ల పాటు తాను హీరోగా ఉండాలనుకుంటున్నట్లు నవ్వుతూ శంకర్‌కు చెప్పినట్లు తెలిపాడు. అంతేకాకుండా రోబోలో తాను హీరోగా ఎందుకు చేయలేదో చెప్పుకొచ్చాడు. ‘ఐ-రోబో’ ఇంగ్లీష్ నవలను రూపొందిస్తే చాలా బాగుంటుందని తాను.. శంకర్.. రచయిత సుజాత 90sలోనే అనుకున్నామని తెలిపాడు. అయితే ఆ సినిమాకి సంబంధించి అప్పట్లో టెస్ట్ లుక్ కూడా జరిగిందని చెప్పాడు.

కానీ ఆ ప్రాజెక్ట్ నోచుకోలేదు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్, డేట్స్ ఇంకా ఎన్నో ఉంటాయి కాబట్టి. అయితే అప్పటి మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమా చేయకపోవడమే బెటర్ అనుకున్నాను. అందుకే విడిచిపెట్టేశానని.. కానీ దర్శకుడు శంకర్ మాత్రం పట్టువిడువలేదని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత రజనీకాంత్‌ను హీరోగా పెట్టి ‘రోబో’ సినిమాను తెరకెక్కించి ఘన విజయాన్ని సాధించాడు అని అన్నాడు. ఇక ‘2.ఓ’ సినిమాలో విలన్ పాత్రకు ముందుగా తనను అనుకున్నారట.. కానీ తాను రిజెక్ట్ చేయడంతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌ను సెలెక్ట్ చేశారు అని చెప్పుకొచ్చాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×