BigTV English
Advertisement

Jr.Ntr: 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే ఇప్పటివరకు సాటిలైట్స్ రైట్స్ అమ్ముడు పోలేదు?

Jr.Ntr: 500 కోట్లు కొల్లగొట్టిన ఎన్టీఆర్ సినిమా.. కట్ చేస్తే ఇప్పటివరకు సాటిలైట్స్ రైట్స్ అమ్ముడు పోలేదు?

Jr.Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఇలా ఎన్టీఆర్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత దేవర సినిమా(Devara Movie)తో మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే ఇటీవల బాలీవుడ్ చిత్రం వార్ 2 సినిమాలో నటించి సందడి చేసిన సంగతి తెలిసిందే.


దేవరకు ఏడాది..

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఇటీవల ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Siva)దర్శకత్వంలో నటించిన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని సుమారు 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లో మాత్రమే కాకుండా ఓటీటీలో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సరిగ్గా రేపటితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది అవుతుంది.. గత ఏడాది దసరా పండుగను పురస్కరించుకొని సెప్టెంబర్ 27వ తేదీ ఈ సినిమా విడుదలైంది. ఇలా ఈ సినిమా విడుదల అయ్యి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది.

సాటిలైట్ రైట్స్ ఎవరూ కొనలేదా?

దేవర సినిమా కంటే కూడా ఆలస్యంగా విడుదలైన సినిమాలు ఇప్పటికే టెలివిజన్ ప్రీమియర్ అయ్యాయి కానీ ఈ సినిమా థియేటర్లో విడుదలై ఏడాది అవుతున్న ఇప్పటివరకు టెలివిజన్ ప్రీమియర్ కు మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇలా రాకపోవడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా హిందీ తెలుగు భాషకు సంబంధించి సాటిలైట్స్ హక్కులు ఇప్పటివరకు అమ్ముడు పోలేదని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా సాటిలైట్ రైట్స్ కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదా? లేకపోతే సరైన డీల్ కుదరని నేపథ్యంలో చిత్ర బృందం ఇవ్వలేదా? అనేది తెలియదు కానీ ఇప్పటివరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం అమ్ముడు పోలేదని తెలుస్తుంది.


దేవర 2 అప్పుడేనా?

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సినిమాకు సాటిలైట్ రైట్స్ అమ్ముడు పోకపోవడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో దేవర 2 కూడా ఉండబోతుందని చిత్ర బృందం వెల్లడించారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే తిరిగి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అవ్వనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతనే దేవర 2 ఉండబోతోందని తెలుస్తోంది.

Also Read: Kantara Chapter1 : కాంతార చాప్టర్ 1 ప్రీ రిలీజ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్!

Related News

Big tv Kissik Talks: చైతన్య మాస్టర్ మరణం పై రాజు ఎమోషనల్… ఆఖరి మాటలు అవే అంటూ!

Gouri G Kishan : నాకు మారి సెల్వరాజ్ సార్ ఫోన్ చేశారు, ఇష్యూ గురించి ఏం చెప్పారంటే?

The Great Pre wedding show: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాపై బెల్లంకొండ రియాక్షన్, మొదటి సెలబ్రిటీ సపోర్ట్

Shraddha Das: అల్లు అర్జున్ టాలీవుడ్ షారుక్.. నా ప్రపంచమే మారిపోయిందన్న నటి!

Actor Vikranth: అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ..700 మంది ఎంప్లాయిస్.. ఈ హీరో బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే!

Ajay Bhupathi : ఘట్టమనేని వారసుడు సినిమా టైటిల్ ఇదే, ఆ సెంటిమెంట్ వదలని అజయ్ భూపతి

Jana Nayagan First Single: జననాయగన్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. థళపతి కచేరి అంటూ!

Thiruveer : సక్సెస్ అవ్వకుండానే సెలబ్రేషన్ చేస్తారు.. నిర్మాతలపై హీరో సెటైర్

Big Stories

×