Suriya Jyothika : నటుడు సూర్య గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు తమిళ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకులు సూర్య ను ఓన్ చేసుకున్నారు. సూర్యను అడాప్టెడ్ సన్ అంటుంటారు. ఈ విషయం సూర్యకి కూడా తెలుసు.
సూర్య జ్యోతిక ల పెయిర్ ఎప్పుడు చూడముచ్చటగా ఉంటుంది. ఇప్పటికీ సోషల్ మీడియాలో వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉన్న వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే సూర్య జ్యోతికలకు దియా అనే ఒక కూతురు ఉంది. తన పేరు దియా సూర్య.
దియా సూర్య దర్శకురాలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనన్నారు. ఇప్పటికే ఆమె లీడింగ్ లైట్స్ అని ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీశారు. ఈ డాక్యుమెంటరీ ఫిలిం లో లైట్ మ్యాన్, లైట్ ఉమెన్ గురించి చూపించబోతున్నారు. లైట్ ఉమెన్ ఒక సినిమా కోసం ఎంత కష్టపడతారు? వాళ్లు ఎదుర్కొనే సమస్యలేంటి? అసలు లైటింగ్ అనేది సినిమాకు ఎంతవరకు కీలకం ఇటువంటి అంశాలు అన్నిటిని కూడా దియాసూర్య డాక్యుమెంటరీ రూపంలో చేశారు. దీనికి లీడింగ్ లైట్స్ అని పేరు పెట్టారు.
లీడింగ్ లైట్ డాక్యుమెంటరీకి మంచి ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలోని రీజెన్సీ థియేటర్‌లో ఆస్కార్ క్వాలిఫైయింగ్ రన్ లో ప్రదర్శించబడుతుంది. ఈ డాక్యుమెంటరీ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు, ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రదర్శించబడుతుంది. అన్ని వర్కౌట్ అయితే ఈ చిత్రం ఆస్కార్ బరిలో ఉంటుంది.
Also Read: Bigg Boss 9 Promo: అమాయకుడు కాస్త అపరిచితుడు అయ్యాడు, తనుజను లోపలికి పిలిచిన సుమన్ శెట్టి